‘తమ యజమానిని ఎలాగైనా సీఎం చేయాలన్నదే లక్ష్యం.. అందుకు ఎవరిపైన అయినా విషం కక్కేందుకు సిద్ధం. కల్పిత వార్తలతో మమ్మల్ని మానసికంగా బెదిరించడం ఈ సమాజానికే నష్టం. సమాజ హితం కోరేందుకే పత్రికలు, పార్టీలు ఉన్నాయా లేదా తమ స్వలాభం కోసం పోలీసులపై విషం చిమ్మేందుకా?’ అని రాష్ట్ర పోలీసులు మండిపడుతున్నారు. రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తోపాటు కొందరు ఉన్నతస్థాయి పోలీసు అధికారులపై ఒక రాజకీయ పార్టీకి చెందిన పత్రిక రాస్తోన్న కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీ అధికారం చేపట్టాలంటే ప్రజా విశ్వాసం గెలుచుకోవడమే మార్గం తప్ప పోలీసుల్ని నిందించడం కాదని హితవు పలికారు. పోలీసు ఉన్నతాధికారులను టార్గెట్‌ చేసి కింది స్థాయి కేడర్‌ను భయపెట్టాలన్న కుట్ర కోణం తప్పుడు వార్తల్లో కనిపిస్తోందని రాయలసీమకు చెందిన ఒక పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు.

police 26032019

పొరుగు రాష్ట్రాల నుంచి పోలింగ్‌కు ముందే ఇక్కడికి భారీగా డబ్బులు తెచ్చేందుకు ఎత్తుగడ వేసిన ఒక రాజకీయ పార్టీ.. అటువైపు పోలీసులు చూడకుండా ముందుగానే మైండ్‌గేమ్‌ ఆడుతోందన్నారు. ఇలాంటి కుట్రలు తిప్పికొడతామని హెచ్చరించారు. రాష్ట్రాలు నియమించుకున్న డీజీపీల నియామకం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ ఆర్పీ ఠాకూర్‌ మార్పు తథ్యం అంటూ పుట్టించారని.. కానీ 2018 జూలై 3 తర్వాత మాత్రమేనని తీర్పులో పేర్కొన్న విషయం ఇలాంటి కల్పిత వార్తలు సృష్టించే వారికి కనపడదని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి ఎద్దేవా చేశారు. జూన్‌ 30న నియమితులైన ఏపీ డీజీపీ విషయంలో ఇది వర్తించబోదని స్పష్టంగా ఉన్నా.. కిందిస్థాయి పోలీసుల్లో గందరగోళం సృష్టించేందుకు వేసిన ఎత్తుగడ ఫెయిల్‌ అయిందన్నారు.

police 26032019

విమానాశ్రయంలో ప్రతిపక్ష నేతపై కోడికత్తితో దాడి సమయంలో అన్ని జిల్లాల ఎస్పీలు, విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌తో మంగళగిరిలోని పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో డీజీపీ సమావేశమయ్యారని విశాఖ జిల్లా కు చెందిన పోలీస్‌ అధికారి తెలిపారు. దాడి విషయం తెలియగానే అక్కడి పోలీసులతో కమిషనర్‌ మాట్లాడగా.. నిందితుడి ఫోన్‌లో జగన్‌తో కలిసి తీసుకున్న ఫొటో ఉందన్న విషయం తెలిసిందన్నారు. విమానాశ్రయ సిబ్బంది ఇచ్చిన లేఖలో జగన్‌కు సానుభూతి రావాలన్న ఉద్దేశంతోనే ఈ దాడి చేసినట్లు ఉందనే సమాచారం అందిందన్నారు. ఇదే సమయంలో ఒక టీవీచానల్‌ చేసిన హడావుడి, జగన్‌ పార్టీ నేతలు ఇచ్చిన స్టేట్‌మెంట్లు చూసిన ఏ పోలీసుకైనా రాష్ట్రంలో అల్లర్లు రెచ్చగొడుతున్నారని అర్థమవుతుందని, శాంతిభద్రతలు అదుపు తప్పకూడదన్న ఉద్దేశంతోనే అసలు విషయాన్ని డీజీపీ వెల్లడించారని ఆ పోలీసు అధికారి స్పష్టం చేశారు. అలా చేయకపోయి ఉంటే బెజవాడలో రంగా హత్య జరిగినప్పటి రోజు పునరావృతమయ్యేదేమో! అన్నారు. ‘శాంతిభద్రతలపై అధికారులతో మాట్లాడటమే డీజీపీ కర్తవ్యం. ఇది వదిలేసి రోడ్డుపై ఆయన లాఠీ పట్టుకుని నిలబడతారా? స్టేషన్లో కూర్చుని ఎఫ్‌ఐఆర్‌ రాసుకుంటారా? అని మరొకరు ప్రశ్నించారు. ఆయన ఠాకూర్‌ కులం ఈ రాష్ట్రంలోనే లేదని, కానీ ఆయనకెందుకు కులం ఆపాదిస్తున్నారో అర్థం కావడం లేదని మరో పోలీసు పెదవి విరిచారు. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని అదుపు చేస్తున్న తమ బాస్‌పై ఇంత అక్కసు ఎందుకు వెళ్లగక్కుతున్నారని మండిపడుతున్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read