మొన్న తన కొడుకులును వేసుకుని, తిరుపతిలో రచ్చ రచ్చ చేసిన మోహన్ బాబు, ఈ రోజు తన ముసుగు తొలగించారు. ఎన్నికల 20 రోజులు ముందు, నాకు డబ్బులు రావాలి, చంద్రబాబు మోసం చేసాడు అంటూ, హడావిడి చేసిన మోహన్ బాబు అసలు నైజం ఇప్పుడు బయట పడింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న కుట్రలో, తానూ ఒక భాగస్వామిని అని చెప్పకనే చెప్పారు మోహన్ బాబు. ఈ రోజు మోహన్ బాబు వైసీపీలో చేరారు. మోహన్ బాబు లోటస్‌పాండ్‌‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. భేటీ అనంతరం వైఎస్ జగన్ సమక్షంలో మోహన్ బాబు వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా.. వైఎస్ కుటుంబంతో మంచు ఫ్యామిలీకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.

mohababu 26032019

పార్టీలో చేరిన అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. తాను పదవి ఆశించి వైసీపీలో చేరలేదన్నారు. తెలుగు ప్రజల మేలు కోసమే వైసీపీలో చేరానన్నారు. "ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చంద్రబాబుతో ఎన్నోసార్లు మాట్లాడాను. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఇంకా రూ. 19 కోట్లు రావాలి. మూడు విడతల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని చేయలేదు. కాపు విద్యార్థులకు రావాల్సిన రూ. 2 కోట్లు ఇవ్వలేదు. వైసీపీలో చేరాలని జగన్‌ మూడేళ్ల కిందటే అడిగారు. ఏపీకి జగన్‌ సీఎం అయితే బాగుంటుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశిస్తే కార్యకర్తగా ప్రచారం చేస్తా. రేపు లేదా ఎల్లుండి ప్రచారానికి నేను వెళ్లొచ్చు" అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

mohababu 26032019

దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడు ఎన్టీఆర్ హయాంలో కీలకనేతగా మోహన్ బాబు ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. తరువాత తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు గెంటారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నారు. వైసీపీతో మోహన్ బాబు రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. మోహన్ బాబుకు రాజ్యసభ సీటిచ్చి ఢిల్లీకి పంపాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా కలెక్షన్‌కింగ్ కుటుంబం వైసీపీ తీర్థం పుచ్చుకుంటుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు మంచు మనోజ్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి ప్రజాసేవ చేయాలని హైదరాబాద్‌ను వదిలి తిరుపతికి వెళ్లడంతో అప్పట్లో మోహన్ బాబు కుటుంబం మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటోందని.. అందుకే ప్రజలకు దగ్గరయ్యేందుకు కార్యక్రమాలు చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read