తెలుగుదేశం పార్టీలో ఎంతో గౌరవంగా బ్రతికి, అన్నీ అనుభవించి, కేవలం చంద్రబాబుని సాధించటం కోసం, పార్టీ మారిన దాసరి బ్రదర్స్ కి జగన్ షాక్ ఇచ్చారు. మీకు విజయవాడ ఎంపీ సీటు ఇస్తాను రండి అంటూ, దాసరి జారి రమేష్ కు చెప్పి, అలాగే దాసరి బాలవర్ధాన్ రావుని కూడా పార్టీలో చేర్చుకున్నారు. ఇక విజయవాడ ఎంపీ సీటు వచ్చేసింది, ఇక నాకు ఎదురు లేదు అనుకుంటూ, అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న దాసరి జై రమేష్ కు జర్క్ ఇచ్చారు జగన్. ఈ రోజు ఉదయం నుంచి విజయవాడ ఎంపీగా మరో వ్యక్తీ వస్తున్నారు, ఆయనకే ఎంపీ టికెట్ అంటూ ప్రచారం జరిగింది. దీంతో దాసరి బ్రదర్స్ షాక్ అయ్యారు. ఇప్పటికే ఎంపీ టికెట్ ఖరారు అయ్యింది అనే ఉద్దేశంతో, చాలా ఫండ్ ఇచ్చామని అంటున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీ రేపు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. గత ఎన్నికల సమయంలో విజయవాడ పార్లమెంటు స్థానంపై మక్కువ పెంచుకున్న పీవీపీ అప్పట్లో జగన్ నుంచి సరైన హామీ లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. దాంతో పార్టీలో చేరికను వాయిదా వేసుకున్నారు. మళ్లీ ఎన్నికలు రావడంతో పీవీపీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బెజవాడ టికెట్ పై ఈసారి స్పష్టమైన హామీ రావడంతో పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. జగన్ సమక్షంలో బుధవారం పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అన్నీ కుదిరితే పీవీపీ మార్చి 23న నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
విజయవాడ లోక్ సభ స్థానం అభ్యర్థిత్వాన్ని ఆశించి ఇటీవల వైసీపీలో చేరిన దాసరి జైరమేష్ కు, ఆయన తమ్ముడు దాసరి బాలవర్ధాన్ రావుకి జగన్ తగిన బుద్ధి చెప్పారనే టాక్ వినిపిస్తుంది. దాదాపు నాలుగున్నరేళ్లుగా విజయవాడ ఎంపీ అభ్యర్ధి అని చెప్పుకునేందుకు ఓ నాయకుడు ఆ పార్టీకి దొరకలేదు. విజయవాడ లోక్ సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల భాధ్యతను కూడా జగన్ పీవీపీ పై పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కేశినేని నాని పై, విజయవాడ ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది. అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది. దీంతో వైసీపీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఈ సారి కూడా మళ్ళీ కేశినేని నాని గెలుపు ఖాయంగా కనిపిస్తుంది.