మళ్లీ గెలుస్తామని బీజేపీ చెబుతోంది. కానీ కమలం గెలుపు అంత ఈజీయా? ఎందుకంటే 2014లో బీజేపీకి తోడున్న పార్టీలు ఇప్పుడు లేవు. బీజేపీ వెంట నడిచిన నాయకులూ లేరు. కమలనాథులకు అండగా నిలిచిన వర్గాలు ఇప్పుడు దూరమయ్యాయి. అంతకు మించి విపక్షాల్లో ఐక్యత కనిపిస్తోంది. ఇదే కమలాన్ని కలవరపెడుతోందా? ఈసారి అధికారాన్ని బీజేపీ చేజిక్కించుకోవడం కష్టమనే చెప్పాలి. 2014లో భారీ మెజారిటీతో సొంతంగా అధికారాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకానొక సమయంలో బీజేపీ దాని భాగస్వామ్య పార్టీలు ఏకంగా 19 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాయి. కానీ ఈ రెండేళ్లలో పరిస్థితి మారిపోయింది.

modi 12032019

బీజేపీ దూకుడు కొనసాగుతున్న సమయంలో పంజాబ్‌లో చుక్కెదురైంది. అక్కడ అకాలీదళ్ ఓడిపోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీ.. బీజేపీకి అధికారాన్ని దక్కనివ్వలేదు. ఇక కీలకమైన హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి.. కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్‌గా మారింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పూర్తిగా ఈక్వేషన్స్ మారిపోయాయి. ప్రస్తుతం బీజేపీ భాగస్వామ్య రాష్ట్రాలు 15 అధికారంలో ఉండగా.. వీటిలో 5 రాష్ట్రాల్లోనే బీజేపీ సొంతంగా అధికారం చేపట్టింది. మిగతా 10 రాష్ట్రాల్లో సంకీర్ణ సర్కారులే ఉన్నాయి. అప్పుడు మోదీని గద్దెనెక్కించిన రాష్ట్రాలే ఇప్పుడు కమలనాథులను టెన్షన్ పెడుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు చేయి జారటమే కాదు.. ఎన్డీయేకి కీలకంగా వ్యవహరించిన రాష్ట్రాలు కూడా ఇప్పుడు దూరంగా జరిగాయి.

modi 12032019

ఏపీలో టీడీపీ పొత్తుతో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ రెండు స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది. అయితే నవ్యాంధ్రకు అన్యాయం చేయడంపై మండిపడ్డ చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు విపక్ష కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ బీజేపీ సొంతంగా స్థానాలు గెలిచే పరిస్థితి కనిపించట్లేదు. 2016 తరువాత జరిగిన ఏ బై పోల్‌లోనూ బీజేపీ గెలిచిన దాఖలాలు లేవు. ఇదే బీజేపీని కలవరపెడుతోంది. దీంతో ఈశాన్య రాష్ట్రాలపై మోదీ దృష్టి పెట్టారు.

 

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read