‘టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు సొంత నియోజకవర్గం గుడివాడ. పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి 1983లో ఎన్టీఆర్‌ అక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1985లోనూ అక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందారు. అలాంటి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరాలి. అందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయండి. అదే ఎన్టీఆర్‌కు మనం అర్పించే నివాళి..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడ టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ను ప్రకటించడంపై స్థానిక టీడీపీ నేతల్లో వ్యక్తమైన అసంతృప్తిని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు సోమవారం వారిని పిలిపించి మాట్లాడారు. టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు నియోజకవర్గం గుడివాడలో దేవినేని అవినాష్‌ను గెలిపించి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుడివాడ పార్టీ నేతలను ఆదేశించారు.

modi 12032019

గుడివాడ అసెంబ్లీ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ను ప్రకటించడంపై గుడివాడ నియోజకవర్గ టీడీపీలో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు సోమవారం గుడివాడ నియోజకవర్గ టీడీపీ నేతలను పిలిపించుకుని మాట్లాడారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సుమారు గంటకుపైగా గుడివాడ నియోజకవర్గ సమన్వయ కమిటీ భేటీ జరిగింది. తొలుత అసెంబ్లీ అభ్యర్థుల స్ర్కీనింగ్‌ కమిటీ సభ్యులు సమన్వయ కమిటీ సభ్యులతో చర్చించారు. చర్చల సారాంశాన్ని తెలుసుకున్న సీఎం చంద్రబాబు అనంతరం గుడివాడ టీడీపీ నేతలతో మాట్లాడారు. గుడివాడ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటిదని, టీడీపీ ఆవిర్భావం తర్వాత మొత్తం తొమ్మిది సార్లు ఎన్నికలు జరగ్గా కేవలం రెండు సార్లు మాత్రమే టీడీపీయేతర అభ్యర్థులు గెలుపొందారని, ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా ఎగరాల్సిందేనని చంద్రబాబు నాయకులకు స్పష్ట చేశారు.

modi 12032019

నియోజకవర్గ నేతలు కలిసి కట్టుగా పనిచేయాలని, పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్‌ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని నాయకులకు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఎలాంటి అసమ్మతిని సహించేది లేదని, పార్టీకి నష్టం కలిగించాలని చూసే నాయకుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. నాయకులందరూ కలిసి కట్టుగా పనిచేసి పార్టీని గెలిపిస్తే, అందరికీ న్యాయం చేసే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అవినాష్‌ గెలుపునకు తీసుకోవాల్సిన చర్యలను నాయకులంతా కలిసి చర్చించుకుని వాటిని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బూత్‌ కమిటీ సభ్యులను క్రియాశీలం చేసి వారి సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. సీఎం చంద్రబాబు ఆదేశం మేరకు అందరం ఐక్యంగా గుడివాడలో టీడీపీ విజయానికి కృషి చేస్తామని టీడీపీ నేతలు దేవినేని అవినాష్‌కు హామీ ఇచ్చారు. మాజీ శాసనసభ్యుడు రావి వెంకటేశ్వరరావు కు ఎలాంటి అన్యాయం చేయబోనని చంద్ర బాబు స్పష్టం చేశారు. రావికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని.. ఈ బాధ్యత తనదేనని అధినేత స్పష్టమైన హామీ ఇచ్చారు.

 

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read