గుంటూరు జిల్లాలోని బాపట్ల ఎస్సీ రిజర్వుడ్ లోక్‌సభ స్థానానికి రాజధాని ప్రాంతంలోని ఉద్దండ్రాయినిపాలేనికి చెందిన నందిగం సురేష్ పేరును ఖరారు చేశారు. వైసీపీ అధినేత జగన్ 9 మంది లోక్‌సభ అభ్యర్థులతో తొలి జాబితాలోనే సురేష్ పేరును ప్రకటించారు. ఉద్దండ్రాయిని పాలెంలో అరటితోట దగ్ధం అయిన కేసులో సురేష్‌పై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. దాంతో వైసీపీ అధిష్ఠానానికి సురేష్ దగ్గరయ్యారు. తొలుత యువజన విభాగం నాయకుడిగా సురేష్ క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో బాపట్ల ఎస్సీ రిజర్వుడ్ స్థానాన్ని రాజధాని ప్రాంతానికి చెందిన సురేష్‌కు కేటాయించాలన్న భావనతో అధిష్ఠానం ఆయన వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. తొలి జాబితాలోనే సురేష్ పేరు రావడం విశేషం.
శనివారం రాత్రి ఆ పార్టీ విడుదల చేసిన జాబితాలో బాపట్లకు నందిగం సురేష్ పేరును ప్రకటించింది. రాజధాని ప్రాంతం ఉద్దండరాయునిపాలేనికి చెందిన ఆయన రాజధానిలో పార్టీ తరఫున చేసిన ఆందోళనల్లో చురుకుగా పాల్గొన్నారు. తొలి నుంచి అధినేత జగన్‌కు సన్నిహితంగా ఉంటుండగా ఏడాది కిందట బాపట్ల లోక్‌సభ సమన్వయకర్తగా నియమించారు. నరసరావుపేట లోక్‌సభ సమన్వయకర్తగా విజ్ఞాన్ విద్యాసంస్థల డైరెక్టర్ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. గుంటూరు లోక్‌సభకు సమన్వయకర్తగా మూడేళ్లు పనిచేసిన తర్వాత నరసరావుపేటకు మార్చారు. నరసరావుపేట నుంచి కూడా తొలిజాబితాలో చోటు దక్కలేదు. గుంటూరు, నరసరావుపేట లోక్‌సభ స్థానాలపై సందిగ్ధం కొనసాగుతోంది.
స్థిరాస్తి వ్యాపారం చేసేవారు. తొలుత కాంగ్రెసులో ఉన్నారు. వైకాపా ఆవిర్భావం తర్వాత దానిలో చేరారు. బాపట్ల లోక్‌సభ సమన్వయకర్తగా ఏడాదిపైగా కొనసాగుతున్నారు. మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గతంలో వైకాపా యువజన విభాగంలో పని చేశారు. కొంతమంది అయితే.. అసలు తమకు సీటు వస్తుందని ఊహించలేదని.. జగనన్న తమకు టికెట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనను ఎంపీ అభ్యర్థిగా జగన్ ఎంపిక చేస్తారని అస్సలు ఊహించలేదని సురేష్ తెలిపారు. వైఎస్ జగన్ ఆశీస్సులతో తాను ఖచ్చితంగా ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో వచ్చేది జగన్ నాయకత్వమేనని.. వచ్చే నవ నాయకత్వానికి నాంది పలకడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఈసందర్భంగా తెలిపారు.