కర్నూల్ జిల్లాలోని మంత్రాలయం మండలం ఖగ్గలు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో టీడీపీ- వైసీపీ వర్గీయుల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి గాల్లోకి కాల్పులు జరిపారు. కాగా ఘర్షణలో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వర్గీయులు వేటకొడవళ్లతో దాడికి యత్నించారు. ఈ ఘర్షణలో ఎడమ కాలికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన నేతలు ఆయన్ను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఏఎస్సై తిరుపాల్‌కు కూడా గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం తిరుపాల్‌ను ఆస్పత్రికి తరలించడం జరిగింది.
అయితే ఈ కాల్పులు జరిపిందెవరు..? కాల్పులు జరిపేదాక పరిస్థితి ఎందుకెళ్లింది..? కాల్పులు జరిపిన వ్యక్తులకు తుపాకులు ఎక్కడ్నుంచి వచ్చాయి..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మంత్రాలయం అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తిక్కారెడ్డి శనివారం ఉదయం మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో ఖగ్గల్ వెళ్లారు. తొలి నుంచి వైకాపాకు పట్టున్న గ్రామమైన ఖగ్గల్‌లో తెదేపా జెండా ఆవిష్కరించడానికి తిక్కారెడ్డి సహా పలువురు కార్యకర్తలు అక్కడకి చేరుకున్నారు. దీంతో వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డి భార్య జయమ్మ, ఆయన కుమారుడు ప్రదీప్‌రెడ్డి గ్రామస్థులతో కలసి అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో తిక్కారెడ్డి గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రమాదవశాత్తూ తిక్కారెడ్డి ఎడమకాలికి బుల్లెట్ గాయమైంది.
మాధవరం ఏఎస్ఐ వేణుగోపాల్ కుడి కాలికి గాయమైంది. దీంతో వారిని ఆదోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గ్రామంలో పెద్ద ఎత్తున మోహరించారు. వైకాపా అసలు ఏం చెయ్యాలనుకుంటుంది ?? ఈ రోజు మంత్రాలయం తెదేపా అభ్యర్ధి మీద వేటకొడవళ్ళతో దాడి చేసింది. పోలీసులు గాల్లోకి కాల్పులు చెయ్యక తప్పని పరిస్థితి. ఏఎస్సై తిరుపాలు కి కూడా గాయాలు. కనీసం ప్రచారం కూడా ప్రారంభించలేదు. ఇలాంటి వ్యక్తులు పొరపాటున అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి ?? తెదేపా అభ్యర్ధులకు విజ్ఞప్తి, దయచేసి సెక్యురిటీ లేకుండా బయటకు రాకండి. మిమ్మల్ని చంపటానికి కూడా వెనుకాడని దుర్మార్గులు మీ ప్రత్యర్ధులుగా ఉన్నారు.