త్రిముఖ పోరులో వైసీపీకి కలిసి వస్తుందని, ఈ సారి విజయం తమదేనని నిన్నటి వరకు గంభీరంగా ఉన్న వైసీపీ నేతల ఆశలపై చంద్రబాబు నాయుడు నీళ్లు చల్లారు. సీనియర్‌ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తల్లో ఏ స్థాయిలో ఉత్సాహం పెరిగిందో అదే స్థాయిలో వైసీపీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. విద్యావంతుడు, కార్యకర్తలతో కలిసి అడుగులు వేసే స్వభావం ఉన్న వ్యక్తి, రాజకీయంగా సరైన దిశా నిర్దేశం చేయగల సమర్థుడు కావడంతో ప్రతిపక్షాలు ఆయోమయంలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం అయిన ప్రత్తిపాడు తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వుంది. నవ్యాంధ్రలో జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం విజయకేతనం ఎగురవేసింది. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన రావెల కిషోర్‌ బాబు పార్టీని వీడి జనసేన తరుపున ప్రత్తిపాడు నుంచే పోటీ చేస్తున్న ఈ తరుణంలో ప్రత్తిపాడులో త్రిముఖ పోటీ ఏర్పడింది.

magunta 16032019

దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే వైసీపీ, జనసేన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ అయిన డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు ప్రత్తిపాడు సీటు కేటాయించారు. డొక్కాకు తొలి నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గంతో సత్సంబంధాలున్నాయి. ప్రత్తిపాడులో మంచి పేరు ఉన్న రాయపాటి శిష్యుడిగా డొక్కాకు మంచి పేరు ఉంది. అంతే కాకుండా కార్యకర్తలకు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ బలాన్నిచ్చి వారికి అండగా ఉంటారనే నమ్మకం కూడా ఆ పార్టీ కార్యకర్తలలో ఉంది. ఈ నేప థ్యంలో ఆయనపై ఎలా గెలుపొందాలో అని ఇప్పటి నుంచే వైసీపీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు.

magunta 16032019

డొక్కా మార్కు రాజకీయం.. ఇదిలా ఉంటే డొక్కా మార్కు రాజకీయంపై వైసీపీ శ్రేణుల్లో అలజడి మొదలైంది. ప్రత్తిపాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా దాదాపు మేకతోటి సుచరిత పేరునే అదిష్ఠానం ఖరారు చేసే అవకాశాలు ఉండడంతో ఇంకా జాబితా విడుదల కానప్పటికీ ఆమె నియోజకవర్గంలో చురుకుగా పర్యటిస్తూనే ఉన్నారు. అయితే మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ ఆమెకు పూర్తి స్థాయి రాజకీయ అనుభవం లేదనేది సొంత పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్న మాట. గత ఎన్నికల్లో ఓటమికి ఇదే కారణంగా వారు భావిస్తూ.. ఈ సారి కూడా అదే పరిస్థితి నెలకొంటుదేమోనని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆ పార్టీలో ప్రత్తిపాడు పై పట్టు ఉండి రాజకీయ నైపుణ్యం కలిగిన నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో డొక్కా రాజకీయం ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని వైసీపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read