ఏపీ ప్రతిపక్షనేత, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చిన్నాన్న, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వైయస్‌ వివేకానంద రెడ్డి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ఆయన మరణ వార్త దావానంలా వ్యాపిం చడంతో వైకాపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పులివెందులకు చేరుకున్నారు. దీంతొ అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హత్యకుగల కారణాల గురించి ఆరా తీస్తున్నారు. పోలీసు బృందాలు తీసుకొచ్చిన డాగ్‌ స్వ్కాడ్‌ కూడా వివేకా ఇంటిచుట్టూ తిరగడం అనేక అనుమానాలను వ్యక్తం చేస్తోంది. వివేకాను పక్కా పథకంతో అంత మొందించేందుకు ప్రణాళికాబద్ధంగా నిందితులు వ్యవహరించి ఉంటారని చెబుతున్నారు. అసలు ముందు వివేకా మృతదేహాన్ని చూసిందెవరు, వెనుకవైపు తలుపు ఎలా తీసి ఉంది, ఆయన్ను చూసినప్పుడు తలమీద గాయాలున్నప్పటికీ గుండె పోటు అని ఎలా చెప్పారు, అయను గాఢ నిద్రలో ఉన్నప్పుడు హంతకులు కత్తులు, గొడ్డళ్లతో దాడిచేస్తే బాత్‌రూమ్‌లోకి ఎలా వెళ్లారు, ఒకవేళ ఆయన తనను తాను రక్షించుకునేందుకు బాత్‌రూమ్‌కు వెళ్తే బెడ్‌రూమ్‌లో రక్తపు మరకలు ఏమయ్యాయి ఇలా అనేక సందేహాలు వ్యక్తమతున్నాయి.

murder 16032019

అయితే ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఆయన ఇంటి పరిసరాల్లో నిత్యం తచ్చాడే ఓ కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు. ఆ ప్రాంతంలో కొత్త వ్యక్తులు కనబడితే మొరిగే ఈ శునకాన్ని మర్డర్ ప్లాన్‌లో భాగంగానే హత్య చేసినట్టు చెబుతున్నారు. అది ఉంటే ఆ ప్రాంతంలోకి వెళ్లడం కష్టమనే ఉద్దేశంతో ముందుగానే దానిని చంపేసినట్టు తెలుస్తోంది. హత్యకు ముందు నిర్వహించిన రెక్కీలో ఈ కుక్కను గమనించిన దుండగులు దాని అడ్డు ముందే తొలగించుకుని హత్యకు పథకం పన్నినట్టు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. కాగా, పోస్టుమార్టం నివేదిక రావడానికి ముందు వరకు వివేకా గుండెపోటుతో మరణించారన్న ప్రచారం జరిగింది. అయితే, ఆయనది హత్యేనని, గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారని తేలడంతో అందరూ విస్తుపోయారు.

murder 16032019

దీనికితోడు ఆయన గాఢనిద్రలో ఉన్నప్పుడు హంతకులు ఒక్కసారిగా దాడిచేస్తే తేరుకుని ఆయన బాత్‌రూమ్‌లోకి వెళ్లే అవకాశమే లేదని కూడా నిపుణులు చెబుతున్నారు. ఆయనకు బాత్‌రూమ్‌లోని హేంగర్లు, టాయిలెట్‌ షింక్‌లు తలకు తగిలినట్లు భావిం చేందుకు ఆయన్ను బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు స్టంట్లు వేయడంతో బాత్‌రూమ్‌కు వెళ్లి గుండెపోటు వచ్చి పడిపోయి తలకు బలమైన గాయాలయ్యి చనిపోయి ఉంటారని భావించే అవకాశముందని హంతకులు భావించారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికితోడు అలా జరిగితే వివేకా ముందుకు పడితే తలకు ముందు భాగంలోనే దెబ్బలు తగలాల్సి ఉంది. అలాకాకుండా వెనక్కు పడి ఉంటే వెనకవైపే గాయా లు అవ్వాల్సి ఉంది. కానీ వివేకా వంటిపై 5 గాయాలున్నట్లు చెబుతున్నారు. తలకు ముందు, వెనుక బలమైన గాయాలు ఉండటంతోపాటు తొడమీద కూడా గాయం ఉండటం అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో వివేకా మృతిపట్ల అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read