తెలుగుదేశం పార్టీ నేత, ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. మండు వేసవిలో ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన ఆయన వడదెబ్బకు గురయ్యారు. తన నియోజకవర్గంలో చేనేత కుటుంబాలను కలిసి మాట్లాడుతున్న పయ్యావుల ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. ఇది గమనించిన స్థానికులు పయ్యావులను సకాలంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిన కేశవ్ ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి విప్ గా ఎదిగారు. ప్రస్తుతం మరోసారి అసెంబ్లీ బరిలో దిగిన ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి నుంచి పయ్యావులకు గట్టిపోటీ తప్పదని భావిస్తున్నారు.

keshav 26032019 3

1994 నుండీ ఉరవకొండలో పయ్యావుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అప్పటి నుండి జరిగిన ఐదు ఎన్నికలలో ఆయన మూడు సార్లు గెలుపొందారు. 1994, 2004, 2009 ఎన్నికలలో కేశవ్ గెలిచారు. కేశవ్ గెలిచిన మూడు సార్లు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోనే ఉండటం విశేషం. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014లో ఆయన గెలవలేదు. దీనితో ఆయన పెద్దగా అధికారం అనుభవించింది లేదు. 2004 నుండి వై. విశ్వేశ్వరరావు పైనే పోటీ చేస్తున్నారు.

keshav 26032019 3

వై. విశ్వేశ్వరరావు 2004 లో వామపక్ష పార్టీ తరపున, 2009లో కాంగ్రెస్ తరపున, 2014లో వైకాపా తరపున పోటీ చేసారు. వై. విశ్వేశ్వరరావు పై నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉన్నా కేశవ్ పై పెద్ద అనుకూలమైన పరిస్థితిలు కూడా లేవని అంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు చేసిన వివిధ సంక్షేమ పథకాలు తనని గెలిపిస్తాయని కేశవ్ భావిస్తున్నారు. డబ్బు కీలక పాత్ర పోషించే ఈ ఎన్నికలలో కేశవ్ వద్ద దానికి లోటు లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఈ సారి ఆశాజనకంగానే ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read