రాష్ట్రంలో ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలో ఈసీ భాగస్వామ్యం కావడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. నిబంధనలను పట్టించుకోకుండా బదిలీ చేయడం సరికాదని తప్పుపట్టారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. లేఖను తీసుకుని ఇప్పటికే టీడీపీ నేతలు కనకమేడల రవీంద్రకుమార్, జూపూడి ప్రభాకర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సీఎం రాసిన లేఖను ఈసీకి అందజేయనున్నారు. ఈసీ స్పందించకపోతే కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమరంలో రాత్రికి రాత్రే ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకోవడం తెలిసిందే.. నిఘా విభాగం బాస్‌ ఏబీ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలను ఎన్నికల కమిషన్‌ బదిలీ చేసింది. వైసీపీ ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

court 27032019

అయితే సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి వివరణ కోరకుండా ఈసీ తీసుకున్న నిర్ణయంపై అధికార, రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి సమాచారం అందించే, ముఖ్యమంత్రి రక్షణ బాధ్యతలు మాత్రమే చూసుకునే ఇంటెలిజెన్స్‌ చీఫ్‌కు నిజానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం ఉండదనీ, సీఎస్‌తో పాటు ఆయన కూడా ఈసీ పరిధిలోకి రారనీ, అయినా ఆయనపై వేటు వేయడం ఆశ్చర్యకరంగా ఉందనీ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
వీరు ముగ్గురూ ఎలాంటి ఎన్నికల బాధ్యతలు నిర్వహించకూడదని ఆదేశిస్తూ, హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేసింది. ఇంటెలిజెన్స్‌లో తదుపరి సీనియర్‌ అధికారి ఆ విభాగం బాధ్యతలు చేపట్టాలని సూచించింది.

court 27032019

ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న వెంకటేశ్వరరావు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ ఫోన్లను కూడా ట్యాప్‌ చేయిస్తున్నారని వైసీపీ నేతలు ఇటీవల పదేపదే ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ గత నెలలో, వైసీపీ ముఖ్య నాయకులు విజయ్‌సాయిరెడ్డి గత శుక్రవారం, సాయిరెడ్డితో పాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి సోమవారం నాడు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదులు అందజేశారు. వీటిపై స్పందించిన ఈసీ బదిలీల నిర్ణయం తీసుకుంది. మరో పక్క, ఈ ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్‌ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. లంచ్ విరామం తరువాత వాదనలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల విధులకు సంబంధం లేని అధికారులను బదిలీ చేయడం అభ్యంతరకరమని పిటిషన్‌లో పేర్కొంది. పిటిషన్‌పై వాదనలు వినిపించాల్సిందిగా ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read