ఎన్నికలకు మరో నాలుగు నెలలే ఉండటంతో వైఎస్సాఆర్ కాంగ్రెస్ అభ్యర్థులపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన విజయవాడ లోక్ సభకు గట్టి అభ్యర్థిని బరిలోకి దింపాలని జగన్ యోచిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున కోనేరు రాజేంద్ర ప్రసాద్, టీడీపీ తరుపున కేశినేని నాని పోటీ చేశారు. అయితే కేశినేని విజయం సాధించారు. దీంతో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన కోనేరు రాజేంద్రప్రసాద్ దాదాపు రాజకీయాల్లో నుంచి తప్పుకున్నట్లే. ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ గత ఎన్నికల్లో డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టారు. దాదాపు 80 నుంచి వంద కోట్ల వరకు ఖర్చు పెట్టారని ప్రచారం జరిగింది. ఎన్నికల తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరమై పోయారు. దాదాపు నాలుగున్నరేళ్లుగా విజయవాడ ఎంపీ అభ్యర్ధి అని చెప్పుకునేందుకు ఓ నాయకుడు ఆ పార్టీకి దొరకలేదు.

vij 20122018

ఉన్న నాయకులు కూడా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందనే భయంతో తప్పించుకు తిరిగే పరిస్థితి. ఆ మధ్య పారిశ్రామిక వేత్త దాసరి జైరమేష్ పేరు తెరపైకి వచ్చినా ఆయన సుముఖంగా ఉన్నారో లేదో తెలీని పరిస్థితి. వైసీపీ తరపున ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగినా దాని మీద క్లారిటీ మాత్రం ఇప్పటికీ లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ, ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొట్లూరి వరప్రసాద్ పేరును జగన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పీవీపీ గతంలోనూ విజయవాడ ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. జనసేన తరుపున గత ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కాని పవన్ కల్యాణ్ జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయకపోవడంతో పీవీపీ కి ఛాన్స్ దక్కలేదు. అయితే ఈసారి జగన్ పార్టీ నుంచి పోటీ చేయాలని పీవీపీ కూడా భావిస్తున్నారు. ఈ మేరకు జగన్ తో ఇప్పటికే పొట్లూరి వరప్రసాద్ చర్చించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

vij 20122018

విజయవాడ లోక్ సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల భాధ్యతను కూడా జగన్ పీవీపీ పై పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కేశినేని నాని పై, విజయవాడ ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది. అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది. దీంతో వైసీపీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఈ సారి కూడా మళ్ళీ కేశినేని నాని గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. ఇక మచిలీపట్నంలో బీసీలకు ఇస్తామంటున్న జగన్.. బాలశౌరి పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నం పార్లమెంట్‌ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన ఎంత వరకూ సిద్దంగా ఉంటారన్నది అనుమానమే. గత ఎన్నికల్లో బందరులో పోటీ చేసిన కొలుసు పార్థసారథి జిల్లా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. గతంలో ఆయన పెనమలూరు టిక్కెట్ ఆశించినా., చివరకు బందరులో పోటీ చేసి ఓడిపోయారు. పార్లమెంటుకు వెళ్లేందుకు సారథి ఇష్టపడకపోవడంతో బందరు స్థానం కూడా ఊగిసలాటలో ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read