అమరావతిలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్క్రుతం కాబోతోంది. 4 మీటర్ల రాక్ ఫౌండేషన్‌తో పాటు డయాగ్రిడ్ నిర్మాణాలను చేపట్టారు. సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాలు జీఏడీ టవర్ల నిర్మాణంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. వచ్చే వారం మూడు రోజుల పాటు రెండో టవర్‌లో రాక్ ఫౌండేషన్‌ పనులు చెయ్యనున్నారు. ఈ పని కోసం, 11వేల 500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను ఉపయోగించబోతున్నారు. ఇది 17 వ తారీఖునే జరగాల్సి ఉన్నా, తుఫాను కారణంగా వాయిదా పడింది. రాజధాని అమరావతిలో గ్రాఫిక్స్ మాత్రమే ఉన్నాయని వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ... నాలుగు మీటర్ల లోతు నుంచి మొత్తం కాంక్రీట్ నింపి ఆ తర్వాత డయాగ్రీట్ భవనం కూడా భారత దేశంలో మొట్టమొదటి సారిగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సచివాలయ భవనాల నిర్మాణం మరో 18 నెలల్లో పూర్తి చేసేందుకు ఏపీ సీఆర్డీయే రంగం సిద్ధం చేసింది.

amaravati 20122018

ఎల్ అండ్ టీ, షాపూర్జీ, పల్లోంజీ, నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ.. మొత్తం మూడు కంపెనీలు నిర్మాణంలోపాలు పంచుకుంటున్నాయి. అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. డిజైన్ల ప్రక్రీయ దాటి నిర్మాణంలోకి వచ్చింది. గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతున్న పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, గెజిటెడ్ అధికారులు, నాలుగోతరగతి ఉద్యోగుల నివాసాల కోసం 10 టవర్ల నిర్మాణం ఇప్పటికే తుది దశకు చేరుకుంది. నిర్మాణ నగరాన్ని తలపించే విధంగా జరుగుతున్న పనుల్లో సుమారు 40 వేల మంది కార్మికులు బాగస్వాములవుతున్నారు. రాయపుడి గవర్నమెంట్ కాంప్లెక్స్ సమీపంలో శాస్వత సచివాలయం, శాఖాధిపతులు కార్యాలయాలు, సాధారణ పరిపాలన కార్యాలయాలు, కమిషనరేట్ల నిర్మాణం ప్రారంభమైంది.

amaravati 20122018

మొత్తం ఐదు టవర్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇందుకు 1,2 టవర్ల నిర్మాణాన్ని షాపూర్జీ, పల్లోంజీ సంస్థలు చేపట్టగా 3,4 టవర్ల నిర్మాణాలను ఎల్ అండ్ టీ, ఐదో టవర్ నిర్మాణాన్ని నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ చేపట్టింది. మరో పక్క, అమరావతిలో ముఖ్య పర్యాటక ఆకర్షణగా నిలిచే ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును నీరుకొండలో గల ఎత్తయిన పర్వత ప్రాంతంపై చేపడుతున్నారు. కొండపై 32 మీటర్ల ఎత్తున నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై ఎల్‌అండ్‌టీకి చెందిన ‘డిజైన్స్ అసోసియేట్స్’ రూపొందించిన ఆకృతులను ముఖ్యమంత్రి పరిశీలించారు. మొత్తం ప్రాజెక్టుకు రూ.406 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. ఈ మొత్తంలో చాలావరకు విరాళాలుగా సేకరిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ట్రస్టు ఒకదాన్ని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంక్రీట్‌తో కాకుండా కాంస్య విగ్రహంగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read