సాంకేతిక పరిజ్ఞానం ఉండటం వేరు దానిని అందుబాటులోకి తెచ్చుకుని సద్విని యాగం చేయడం వేరు. ఆంధ్రప్రదేశ్‌లో అదే సరిగ్గా జరిగింది. సంక్షేమ ఫలాలు అందరికీ చేరుతున్నాయా? లేదా? ఫైళ్లు వేగంగా కదులుతున్నాయా? లేదా? ఇలా అన్ని పనుల్లోనూ ఎంతో కీలకంగా ఉన్న ఆర్టీజీఎస్‌ ఇప్పుడు తుపాను నాడినీ పట్టేసింది. పెథాయ్‌ అల్పపీడనం నుంచి పెను తుపానుగా మారి తీరం దాటేదాకా ఆర్టీజీఎస్‌ రాత్రింబవళ్లు సమీక్షించింది. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు అందిస్తూ అప్రమత్తం చేసింది. సాంకేతికతను అందిపుచ్చుకుని పెథాయ్‌ తుపాన్‌కు ప్రభుత్వం స్పందించిన తీరు భారీ నష్టాలను కట్టడి చేయ గలిగింది. అంతే కాకుండా ముందస్తు చర్యలు బాధితులకు పెను నష్టం జరగకుండా నివారించగలిగాయి.

rtgs 18122018 2

మూడు రోజుల ముందుగానే తుపాను కదలికలను పసిగట్టడం అందుకు తగ్గట్టుగా యంత్రాంగాన్ని మోహరిం చడం తుఫాను తీరాన్ని దాటాక జరిగిన నష్టం ప్రభావం ఎక్కువగా బాధితులపై పడకుండా చూడటంలో యంత్రాం గం సఫలీకృతమైంది. ప్రభావం ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ప్రాథమిక సమాచారం ప్రకారం 52 చోట్ల చెట్లు కూలితే వెంటనే ఆ మార్గాలను సుగుమం చేయడం విశేషం. అలాగే దాదాపు 200 వరకు విద్యుత్‌ స్థంభాలు దెబ్బ తింటే వెంటనే వాటిని పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టారు. లక్షలాది మందికి ఫోన్‌ కాల్స్‌ వెళ్లడంతో అవి ఎంతో ఉపకరించాయని ప్రజలే స్వయంగా చెబుతున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు సమీపంలోని పునరావాస కేంద్రాల్లో తల దాచుకోవడం, సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం జరిగి పోయాయి. కోత యంత్రాలు, టార్పాలిన్లు కావాలని 1100 కాల్‌సెంటర్‌కు రైతుల నుంచి ఫోన్లు రావడంతో వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి గుంటూరుకు 13, కృష్ణాకు 20 యంత్రాలు పంపేలా చర్యలు తీసుకుంది. సహాయ చర్యల్లో భాగంగా ఆది, సోమవారాల్లో 10వేల టార్పాలిన్లు అందించారు.

rtgs 18122018 3

ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక విప్లవానికి పునాదులు వేసిన రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్న ఆలోచనలకు ప్రత్యక్ష సాక్ష్యం. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబుకు ఆర్టీజీఎస్‌ ఓ ఆయు ధం. భూగర్భ జల మట్టాల మొదలుకొని వాతావరణంలోని మార్పులను సైతం ఇట్టే పసిగట్టి ఆధునిక సాంకేతిక విధానంతో ప్రజలను ప్రకృతి విపత్తుల నుండి కాపాడేందుకు ఆర్టీజీఎస్‌ ఎంతగానో దోహదపడుతుంది. తిత్లి, పెథాయ్‌ విపత్తులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొందంటే అందుకు ఆర్టీజీఎస్‌ సేవలు కారణం. తిత్లి తుఫాను వజ్రపుకొత్తూరు తీరం దాటుతుందని రెండు రోజుల ముందే ఆర్టీజీఎస్‌ పసిగట్టింది. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. తిత్లి భీభత్సానికి విజయనగరం, విశాఖ జిల్లాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోగా కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఫోన్‌ కమ్యునికేషన్‌ పునరుద్ధరించగలిగారంటే ఆ అద్భుతం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌తోనే సాధ్యమైంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read