ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దాదాపు గత మూడు సంవత్సరాల్లో వైద్యం కోసం ప్రజలు తమ సొంత నిధులు ఖర్చు చేయడాన్ని గణనీయంగా తగ్గించగలిగింది. రాష్ట్రంలో ప్రజలకు 21 రకాల వైద్య సేవలు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకువచ్చింది. 19 కార్యక్రమాలను పీపీపీ విధానంలో అమలు చేస్తోంది. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్, చంద్రన్న సంచార చికిత్స, మహిళా మాస్టర్ హెల్త్ చెకప్, ఎక్స్‌రే, ఎంఆర్ స్కాన్, సీటీ స్కాన్, వివిధ పరీక్షలు, మహాప్రస్థానం, ఉచిత అంబులెన్సు వంటి పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి.

health 13122018 2

వైద్య సేవలు, పరీక్షల కోసం తమ సొంత నిధులను ఖర్చు చేయకుండా, ప్రభుత్వ సేవలు పొందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగుల సంఖ్య గతంతో పోలిస్తే ఎక్కువ అవుతోంది. అక్కడ లభిస్తున్న వైద్య సేవలే ఇందుకు కారణంగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 2015లో వైద్య ఖర్చుల కోసం సొంత నిధుల తలసరి ఖర్చు 5770 రూపాయలుగా ఉండేది. ఇది 2017 నాటికి 1205 రూపాయలకు తగ్గగా, ఈ ఏడాది నవంబర్ నాటికి 588 రూపాయలకు తగ్గింది. దాదాపు నాలుగు సంవత్సరాల్లో 90 శాతం మేర ప్రజలు వైద్య సేవల కోసం తమ సొంత నిధులు ఖర్చు చేయడం తగ్గింది.

health 13122018 3

మెడికల్ హెల్త్ కేర్‌పై 2015లో 5062 రూపాయలు ఖర్చు చేయగా, 2018 నాటికి 336 రూపాయలకు తగ్గించగలిగింది. వివిధ ప్రయోగశాల పరీక్షల నిమిత్తం తలసరి సగటున 860 రూపాయలు ఖర్చు చేయగా, అది 80 రూపాయలకు తగ్గింది. ఔషధాలు తదితరాల కోసం 2531 రూపాయలుగా ఉండే ఖర్చును 135 రూపాయలకు తగ్గించడంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితాలను ఇచ్చాయి. ఔషధాల కోసం చేసే ఖర్చును 95 శాతం, ప్రయోగశాలల కోసం చేసే ఖర్చులో 91 శాతం మేర తగ్గించగలిగింది. ఇది ప్రభుత్వ వైద్య సేవల పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణగా వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read