సూది నుంచి సీటీ స్కాన్‌ వరకు... వైద్యరంగానికి చెందిన అన్ని రకాల ఉపకరణాల తయారీకి ప్రత్యేకించిన ‘మెడ్‌టెక్‌ జోన్‌’ ప్రారంభమైంది. విశాఖలో ఏర్పాటు చేసిన దేశంలోనే మొట్టమొదటి వైద్య ఉపకరణాల తయారీ సెజ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబేతో కలిసి జాతికి అంకితం చేశారు. ప్రభుత్వ నిధులతో దేశంలో తొలిసారి నిర్మించిన వైద్య పరికరాల పార్క్‌ మెడ్‌టెక్‌ జోన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం జాతికి అంకితం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సమీపంలోని ప్రగతి మైదాన్‌లో దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. కీలకమైన పలు భవనాలు, పారిశ్రామిక యూనిట్లను ఆయన ప్రారంభించారు. ఇదే ప్రాంగణంలో కలామ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటుచేసిన నాల్గో డబ్ల్యూహెచ్‌వో వైద్య పరికరాల ప్రపంచ సదస్సును కూడా ప్రారంభించారు. మెడ్‌టెక్‌ జోన్‌లో ఏర్పాటు చేసిన వివిధ ల్యాబ్స్‌, సంస్థలను కేంద్ర మంత్రితో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రోబోనిక్‌ ఇండియా, ఫోరస్‌ హెల్త్‌, మాస్‌ మెడ్‌టెక్‌, గ్రీన్‌ ఓషన్‌ రీసెర్చ్‌ ల్యాబ్స్‌, ఫోనిక్స్‌ మెడికల్‌ సిస్టమ్స్‌, రెనాలిక్స్‌ హెల్త్‌ సిస్టమ్స్‌, బయోసైన్స్‌ టెక్నాలజీస్‌, జైనా మెడిటెక్‌ వంటి సంస్థలను కూడా చంద్రబాబు పరిశీలించారు.

amtz 14122018 2

విశాఖ జిల్లాలోని పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ మెడ్‌టెక్‌ జోన్‌లో ఇప్పటికే రూ.10,000 కోట్ల పెట్టుబడులతో 80 కంపెనీలు ప్రారంభం అయ్యాయి. ఈ జోన్‌లో మొత్తం 250 కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. అవన్నీ ఏర్పాటైతే మొత్తం 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని అంచనా. భారత్‌ ఏటా రూ.30 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటోందని... ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే లక్ష్యంతో మెడ్‌టెక్‌ జోన్‌ను ఏర్పాటు చేసారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా, విశాఖలో ఫర్మా సిటీ పెట్టి, అనేక కంపనీలను తీసుకొచ్చారు. ఇప్పుడు మెడ్ టెక్ జోన్ తో, అనేక వైద్య పరికరాల తయారీ కంపెనీలు రానున్నాయి.

amtz 14122018 3

ప్రపంచ అవసరాల కోసం అత్యాధునిక వైద్య పరికరాలను విశాఖలో తయారుచేసేలా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రపంచ వైద్యపరికరాల మార్కెట్‌కు విశాఖను కేంద్రం చేయాలని తపిస్తున్నామన్నారు. ప్రపంచ ఆర్థిక ఫోరంతోపాటు మరికొన్ని కీలక సదస్సులకు ఐక్యరాజ్యసమితి విభాగాలు దావోస్‌ను కేంద్రంగా ఎంచుకున్నాయని, ఇదే తరహాలో విశాఖను కూడా కేంద్రంగా ఎంపిక చేసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. వచ్చే డబ్ల్యూహెచ్‌వో సదస్సునూ విశాఖలోనే నిర్వహించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యపరికరాల మార్కెటింగ్‌ 2023కి 409 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని, 2030కి అది 800 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆసియాలో 17శాతం పురోగతి ఉందని తెలిపారు. జపాన్‌, చైనా, దక్షిణకొరియా తర్వాత భారత్‌లోనే వైద్య పరికరాలకు గిరాకీ ఉందని వెల్లడించారు. అత్యధికంగా మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌, సర్జికల్‌ డివైజెస్‌, ఆసుపత్రి పరికరాలకు 53.7శాతం గిరాకీ ఉందని చెప్పారు. ఇప్పటిదాకా 65-70శాతం వైద్య పరికరాలను విదేశాలనుంచే దిగుమతి చేసుకుంటున్నామన్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read