కేసీఆర్ ఏపి రాజకీయాల్లో వేలు పెట్టటం ఏమో కాని, ఇక్కడ కొంత మంది మాత్రం, వీర లెవెల్లో రెచ్చిపోతున్నారు. అప్పట్లో స్వతంత్ర పోరాటం చేసే క్రమంలో, ఇక్కడ కొంత మని మన దేశంలో విష పురుగులు, బ్రిటీష్ వారితో కలిసి, సొంత మాతృభూమికే అన్యాయం చేసారు. ఇలాంటి విష పురుగులు, ఇప్పుడు ఏపిలో కూడా తయారయ్యాయి. ఏపి ప్రజలను ఛీ కొట్టి, కుక్కలు, రాక్షులు అని, చివరకు మనం తినేది పెంట అని సంభోదించినా, ఇక్కడ కొంత మందికి మాత్రం, కేసీఆర్ అంటే ప్రేమ కారిపోతుంది. మన కష్టంతో నిర్మించుకున్న హైదరాబాద్ నుంచి మనలను గెంటేసి, కనీసం రాజధాని కూడా లేకుండా, ప్రయాణం ప్రారంభించిన మన ధుస్తుతికి కారణం అయిన కేసిఆర్ ను నెత్తిన పెట్టుకుంటున్నారు.
ఇన్ని ఇబ్బందుల్లో రాష్ట్రం ఉన్నా, మనకు 5 వేల కోట్లు విద్యుత్ బకాయులు ఇవ్వని కేసీఆర్ అన్నా, దాదాపు 50 వేల కోట్ల ఉమ్మడి ఆస్థుల విభజన చేసి మన రాష్ట్రానికి ఇవ్వని కేసీఆర్ అన్నా, పోలవరం ఆపే కేసీఆర్ అన్నా, ఏపికి ప్రత్యేక హోదా వద్దు అంటున్న కేసీఆర్ అన్నా, ఏపిలో కొంత మందికి, ఇక్కడ ప్రతిపక్ష నాయకులకి, కేసీఆర్ అంటే ప్రేమ కారిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి మన రాష్ట్రం, మన ప్రాంతం కంటే, కులం ముఖ్యం.. రాష్ట్రం మీద ప్రేమ కంటే, చంద్రబాబు మీద కోపం ఎక్కువ, అందుకే చంద్రబాబు ఏపిని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తున్నా, ఏపిని అన్ని విధాలుగా చిన్న చూపు చూస్తున్న కేసీఆర్ అంటే, వీళ్ళకి ప్రేమ కారిపోతుంది. తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేసారు. ఎందుకంటే ఆయన అక్కడ 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసారు, సైబరాబాద్ నిర్మాణం చేసారు, ఆ హక్కుతో అక్కడ ప్రచారం చేసారు. కాని, కేసీఆర్ మాత్రం, కేవలం రాజకీయ కక్షతో, ఏపికి వస్తున్నా అంటున్నారు. సంతోషం, ఎవరైనా రావచ్చు, ప్రజలు తేలుస్తారు.
ఇక్కడ కేసీఆర్ చెప్పే మాట పెద్ద విశేషం కాదు. ఆయన మొదటి నుంచి ఆంధ్రా ద్వేషి. కాని ఈ ఆంధ్రా ద్వేషిని, పవన్ కళ్యాణ్, జగన్ ఎలా పొగుడుతారు ? చంద్రబాబు మీద ద్వేషం ఒక్కటే కారణమా ? ఏపి ప్రజలు గురించి వీరి ఆలోచించరా ? ఇప్పుడు ముద్రగడ వంతు. కేసీఆర్ ఏపికి వస్తే సాదర స్వగతం పలుకుతారు అంట. ఇద్దరూ కలిసి, చంద్రబాబుని ఓడిస్తారు అంట. ఏ విధంగా ముద్రగడ ఇలా అంటారు ? అక్కడ కేసీఆర్ ఏ విధమైన కమిషన్ వెయ్యకుండా, అక్కడ ప్రజలను మభ్యపెట్టి ముస్లిం రిజర్వేషన్లు ఇస్తే, కోర్ట్ కొట్టేసింది. చంద్రబాబు ఇలా మభ్యపెట్టకుండా, కోర్ట్ కొట్టేస్తుంది అని తెలిసి, ఒక కమిషన్ వేసి, సైంటిఫిక్ గా రిపోర్ట్ తయారు చేసి, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వమని తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు. ఇక్కడ ఎవరికీ చిత్తశుద్ధి ఉంది ? కేవలం చంద్రబాబు మీద కోపంతో, ఏపి ప్రజల ఆత్మగౌరవాన్ని, సిగ్గు లేకుండా, ఈ బ్యాచ్ అంతా కలిసి కేసీఆర్ కాళ్ళ కింద పెడుతున్నారు.