కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో రూ.1500 కోట్లతో భారీ సిమెంట్‌ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు రామ్‌కో సంస్థ ముందుకు వచ్చింది. కర్మాగారాన్ని తదుపరి దశల్లో పూర్తి స్థాయిలో విస్తరించేందుకు దాదాపు రూ. 3వేల కోట్లతో పెట్టుబడి పెట్టనున్నారు. రామ్‌కో సిమెంట్ ప్లాంటుకు ఈరోజు చంద్రబాబు శంకుస్థాపన చెయ్యనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్క్ కర్నూలు జిల్లాలో ఏర్పాటైంది. ఇప్పుడు రామ్‌కో వంటి పరిశ్రమల రాకతో కర్నూలు జిల్లా దేశంలో అతి పెద్ద సిమెంట్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారిపోతోంది. కర్నూలు జిల్లాలో ఇప్పటికే JSW, SV, మహా సిమెంట్, పాణ్యం, ప్రియా సిమెంట్, పోర్టుల్యాండ్ సిమెంట్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. రామ్‌కో ఇప్పుడు వాటికి జతయ్యింది.

ramco 14122018 2

కర్నూలు జిల్లాలో కొత్తగా ఏర్పాటవుతున్న సిమెంట్ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 300 మంది, పరోక్షంగా 1000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. 15 మెగావాట్ల వేస్ట్ హీట్ రికవరీ పవర్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో 30కి పైగా సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. ACC, భవ్య సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, హేమాద్రి సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, JP, KCP, JSW, MY HOME, పెన్నా సిమెంట్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. రూ.20,660 కోట్ల పెట్టుబడులు ఈ రంగం నుంచి వున్నాయి. 22,100 మంది ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు.

ramco 14122018 3

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో రూ.1500 కోట్లతో రామ్‌కో సిమెంటు పరిశ్రమను త్వరలో నిర్మించనున్నట్లు సంస్థ జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ, డిప్యూటీ జనరల్ మేనేజర్ అజ్మల్ తెలిపారు. మొదటి దశలో రూ.1000 కోట్లతో ఫ్యాక్టరీ నిర్మాణం పనులు చేపడుతామన్నారు. అనంతరం రూ.500 కోట్లతో రెండవ దశ విస్తరణ పనులు జరుగుతాయన్నారు. 3.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించేలా ప్లాంటు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. పరిశ్రమ పరిసరాల్లోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. పరిశ్రమ స్థాపన ద్వారా ఇక్కడి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, యువకులు, మేధావులతో గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి ఆ గ్రామ కమిటీ సూచన మేరకు రోడ్లు, తాగునీరు, వీధిలైట్లు, విద్యా, వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read