కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీసీఎల్ కార్యకలాపాలు అతి త్వరలోనే ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ప్రారంభం కానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా ఈ నెల 20 తేదీన టీసీఎల్ భూమిపూజ నిర్వహించనున్నారు.ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం జరగనుంది.ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తిరుపతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సమీపంలో 158 ఎకరాల్లో టీసీఎల్ కంపెనీ ఏర్పాటు కానుంది. శ్రీవారి ఆలయంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి... టీసీఎల్ రాకతో ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారనుంది.టీసీఎల్ రాకతో 8 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో టీసీఎల్ 2,200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.డిసెంబర్ 2019 కి కంపెనీ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలి అని టీసీఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ కార్యక్రమంలో టీసీఎల్ ఛైర్మెన్ లీ డాంగ్ షెన్గ్ (LI Dongsheng) పాల్గొననున్నారు

tcl 19122018 2

టీసీఎల్ కంపెనీ ఏపీకి తీసుకురావడం వెనుక ఐటీ మంత్రి నారా లోకేష్ అలుపెరుగని కృషి ఉంది. లోకేష్ ముందుచూపు, పక్కా ప్రణాళికతో టీసీఎల్ యాజమాన్యాన్ని ఒప్పించగలిగారు. దీనికి చాలా రోజుల ముందే టీసీఎల్ కంపెనీ ప్రతినిధులు ఇండియా వచ్చారు. అప్పుడే వీరిని కలిసిన మంత్రి లోకేష్..ఏపీలో ఐటీ, ఎలక్ర్టానిక్స్ పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, కల్పిస్తున్న ప్రోత్సాహకాలు వారికి వివరించారు. అప్పటి నుంచీ టీసీఎల్ ప్రతినిధులతో చర్చలు కొనసాగిస్తూనే ఉన్నారు. కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్ తయారీలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న టీసీఎల్.. ఇండియాలో ఏపీయే తమ సంస్థ కార్యకలాపాలకు అనువైన ప్రదేశమని నిర్ణయం తీసుకునేలా మంత్రి ఇక్కడి పరిస్థితులను వారికి వివరించారు. అనంతరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలలో పాల్గొనేందుకు చైనా పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ టీసీఎల్ ప్రతినిధులతో చర్చించి, ఒప్పందం జరిగే వరకూ అంతా తానై వ్యవహరించారు.

tcl 19122018 1

సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లో దేవదేవుడు కొలువుదీరిన తిరుపతి నగరంలో టీసీఎల్ భూమిపూజకు జరిగిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి. టీవీలు,స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మేషిన్లు, ఫ్రిజ్ వంటి కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్ తయారీలో అంతర్జాతీయంగా టీసీఎల్ కంపెనీకి మంచి పేరుంది. ప్రపంచవ్యాప్తంగా టిసిఎల్ కంపెనీలలో 75 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. టివి ప్యానల్స్ తయారీ లో ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది.ఇప్పుడు తిరుపతిలో ఏర్పాటు చేసే టీసీఎల్ కంపెనీతో వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు..ఉపాధి పొందనున్నారు. రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి సంబంధించిన కంపెనీలు లేవు.నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధి కి తీసుకున్న అనేక నిర్ణయాలు,తీసుకొచ్చిన పాలసీలు,ఏపీ ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉండటం వలన ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందింది.ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి గా దేశంలోని అనేక నగరాలు,అనేక దేశాల్లో పర్యటించి మంత్రి నారా లోకేష్ ప్రపంచంలోనే ప్రఖ్యాత కంపెనీల అధిపతులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అని ఆహ్వానించారు.దీనితో అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయి. ఒక్క ఫ్యాక్స్ కాన్ కంపెనీ లోనే 15 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు.దేశంలో తయారు అవుతున్న ఫోన్లలో 30 శాతం ఫోన్లు ఆంధ్రప్రదేశ్ లో తయారు అయ్యే స్థాయికి చేరుకున్నాం.సెల్ కాన్,డిక్సన్,కార్బన్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి.

tcl 19122018 1

585 కోట్ల పెట్టుబడితో 6,600 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఫ్లెక్స్ ట్రానిక్స్ కంపెనీ త్వరలోనే కంపెనీ నిర్మాణం ప్రారంభించబోతుంది.ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ జియో అతి పెద్ద పెట్టుబడి పెట్టనుంది 15 వేల కోట్ల పెట్టుబడితో, 20 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కంపెనీ ఏర్పాటు చేయనుంది.తిరుపతిలో 150 ఎకరాల్లో రిలయన్స్ జియో ఎలక్ట్రానిక్స్ పార్క్ ని ఏర్పాటు చేయనుంది. త్వరలోనే రిలయన్స్ జియో భూమి పూజ కూడా జరగనుంది.సన్నీ ఓపోటెక్ కూడా 500 కోట్ల పెట్టుబడి,4000 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే కంపెనీ ఏర్పాటు చేయనుంది.తిరుపతిలో 75 ఎకరాల్లో 1400 కోట్ల పెట్టుబడితో 6 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కెమెరా మాడ్యూల్స్,స్క్రీన్స్ తయారీ కంపెనీ హోలీ టెక్ కూడా తిరుపతి లో కంపెనీ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనుంది.కేవలం అసెంబ్లీ తో ఆగిపోకుండా ఎలక్ట్రానిక్స్ తయారీ లో వినియోగించే ప్లాస్టిక్స్ నుండి సర్క్యూట్ బోర్డ్ తయారీ వరకూ అన్ని కంపెనీ లను ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావాలి అనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read