రాజకీయాల్లో జేసీ దివాకర్‌రెడ్డిది విలక్షణమైన వ్యక్తిత్వం. ఆయనను మరొకరితో పోల్చడం కష్టం. నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా మాట్లాడడం ఆయనకే సాటి. స్వపక్షంలో ఉంటూనే ప్రతిపక్ష పాత్ర వహిస్తూ ఉండడం ఆయనకున్న మరో ప్రత్యేకత. అయితే బుధవారం అనంతపురంలో ధర్మ పోరాట దీక్షలో దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్‌ జన్మలో సీఎం కాలేరు. హిందూపురం ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.10 కోట్లు అడుగుతున్నాడు. సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలు వదిలి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి. కుట్రలు ఛేదించడంలో చంద్రబాబు మొనగాడు’’ అని దివాకర్‌రెడ్డి కొనియాడారు.

jc 26122018 2

ఒక మహాత్తరమైన కుట్ర జరుగుతున్న పరిస్థితిలో మొట్టమొదటిసారిగా మేల్కొని ఆ కుట్రను భగ్నం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నద్ధమయ్యారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. కుట్రలు చేధించేదాంట్లో చంద్రబాబు మొనగాడు.. మగాడని.. ఖచ్చితంగా నూటికి నూరుపాళ్లు అనుకున్నది సాధిస్తారని జేసీ కొనియాడారు. అందుకే ఇవాళ దేశం యావత్తు బీజేపీకి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తుందని అన్నారు. అలుపెరగని పోరాటం చేస్తున్న చంద్రబాబు ఈసారి కూడా ముఖ్యమంత్రి కావాలని జేసీ ఆకాంక్షించారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రప్రజలు నిశ్చింతగా నిద్రపోవచ్చన్నారు. తరతరాల దారిద్ర్యం పోతుందన్నారు. నీళ్ల కోసం తాపత్రయపడుతున్న చంద్రబాబు నిజంగా ధన్యజీవి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

jc 26122018 3

మోదీ మోసం ఏపీ ప్రజల గుండెల్లో నాటుకుపోయిందన్నారు. అనంతలో అతి పురాతన ప్రాజెక్టులలో బీటీ ప్రాజెక్ట్ ఒకటి అని.. దివంగత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కలలు కన్న ప్రాజెక్ట్ అన్నారు. దాన్ని చంద్రబాబు సాకారం చేశారన్నారు. బీటీ ప్రాజెక్టును చూసి పైనుంచి సంజీవరెడ్డి సంతోషిస్తారని జేసీ అన్నారు. చంద్రబాబు కుటుంబాన్ని తరతరాలుగా గుర్తుపెట్టుకుంటారని తెలిపారు. నీళ్లివ్వడమనే మహత్తర కార్యక్రమాన్ని చంద్రబాబు చేపట్టారని.. ఆయన మేధస్సుకు, ముందు చూపుకు జోహార్లన్నారు.
ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాళ్ల చూపు తప్ప.. ముందుచూపు లేదన్నారు. జగన్‌కు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని తెలిపారు. తరతరాలు దారిద్ర్యం మర్చిపోవాలంటే... చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. లేదంటే ఏ బెంగళూరో వెళ్లి.. కూలీనాలీ చేసుకుంటూ చచ్చిపోవలసిందేనన్నారు. ‘‘ఆయన కోసం కాదని.. మన కోసం.. మన పిల్లల కోసం... టీడీపీకి ఓటెయ్యాలి’’ అంటూ ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read