నిన్నటి వరకు వివిధ పార్టీల నేతలను కలిసిన తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. బుధవారం ప్రధాని మోదీతో భేటీ కానుండటంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఫ్రంట్ అంటూ పర్యటనలు చేస్తున్న కేసీఆర్ ప్రధానిని కలవడంలో అర్థమేంటన్నారు. మోదీని కలిసి రాష్ట్ర సమస్యలు వివరిస్తారా? బ్రీఫింగ్ చేయడానికి వెళ్తున్నారా? అని కేసీఆర్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. ఏదైనా ఒక మాట చెప్పడం వేరని, చేసే పనులు వేరేగా ఉంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నిన్నటి వరకు వివిధ పార్టీలను కలిసిన కేసీఆర్ ఇవాళ ప్రధానిని కలుస్తున్నారన్నారు. ఫ్రంట్ అంటూ కేసీఆర్ పర్యటనలు చేస్తూ ప్రధానిని కలుస్తున్నారంటే అర్థమేమిటి అని ప్రశ్నించారు. మోదీకి బ్రీఫింగ్ చేయడానికి వెళ్తున్నారా...లేక సమస్యలు చెప్పడానికి వెళ్తున్నారా అని చంద్రబాబు అడిగారు.
దేశంలో ఉన్నది రెండే ఫ్రంట్ లని, ఒకటి బీజేపీ అనుకూల ఫ్రంట్, మరొకటి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ అని చంద్రబాబు అన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థుతుల్లో అటు బీజేపీ కాని, ఇటు కాంగ్రెస్ కాని లేకుండా, మూడో ఫ్రంట్ అనేది సాధ్యం కాదని, ఈ విషయం పై 22 పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని చంద్రబాబు అన్నారు. కేసీఆర్ ఏ ఫ్రంట్ లో ఉంటారో తేల్చుకోవాలని, అంతే కాని, కూటమిలో చీలక తెచ్చి మోడీకి లబ్ది చేకూర్చే ప్రయత్నం చేద్దమనుకుంటే, కుదరదని అన్నారు. మరో పక్క, ఇటు జగన మోహన్ రెడ్డిని, అటు పవన్ కళ్యాణ్ ని కూడా ఇదే విషయం పై స్పష్టత కోరారు చంద్రబాబు. జగన్, పవన్ అటు బీజేపీ పక్షమో, బీజేపీ వ్యతిరేక పక్షమో చెప్పాలని, ఇప్పటి వరకు వారికి దీని పై సమాధానం లేదని అన్నారు.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తాను అంటూ, దీనికోసం భాజపా, కాంగ్రెసేతర పక్షాలు ఏకం కావాలంటూ కేసీఆర్ వివిధ రాష్ట్రాల నేతలను కలుస్తున్నారు. ఇటీవల ఒడిశా, పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రులు నవీన్‌పట్నాయక్, మమతా బెనర్జీతో భేటీ అయి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అయితే వారి నుంచి కేసీఆర్ కు సహకారం అందలేదు. నవీన్ పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ, మేము పోలవరం పై చర్చించుకున్నామని అంటే, మమత అసలు మీడియాతోనే మాట్లాడలేదు. వీరిద్దరినీ కలవగానే, ఈ రోజు ఢిల్లీ వెళ్లి మోడీని కలిసారు కేసీఆర్. అయితే కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం, ప్రతిపక్షాల పార్టీల్లో చీలక తెచ్చి, వారిని బలహీన పరిచి, బీజేపీకి లబ్ది చేకూర్చటమే అని, చాలా పార్టీలు నమ్ముతున్నాయి. అందుకే కేసీఆర్ వైపు ఎవరూ మొగ్గు చూపించటం లేదు. మరోవైపు కేంద్రంలో భాజపాయేతర కూటమి ఏర్పాటుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ విధానాలతో దేశం నాశనం అయ్యిందని, దేశాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపుకు, 22 పార్టీలు స్పందించాయి.