బీజేపీ పై నాలుగేళ్లుగా బిగిసిన మోదీ, అమిత్‌ షాల పట్టు తప్పుతుంది. ఇటీవలి ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నాయకత్వంపై ధిక్కార స్వరాలు మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీ-అమిత్‌ షా ద్వయంపై అసంతృప్తులు వ్యక్తమవుతుండడంతో వారిద్దరి కోటరీలో ఉన్న నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోదీ, అమిత్‌ షాల మీద మంగళవారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. తాజాగా మరో కీలక నేత పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దళిత నేత సంఘ ప్రియ గౌతమ్‌ మాట్లాడుతూ, మంచి పరిపాలన కోసం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరిని ఉప ప్రధానిగా నియమించాలని డిమాండ్‌ చేశారు.

cbn protest 26122018

రాజ్యసభ సభ్యుడైన అమిత్‌ను సభలో వ్యూహరచనకు పరిమితం చేయాలని, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని ప్రతిపాదించారు. అమిత్‌ షా, మోదీ ఆధిపత్య ధోరణిపై పార్టీలో చాలా మంది నేతలు కోపంగా ఉన్నారు. 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాత అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. గెలుపును వారిద్దరి ఖాతాలో, ఓటమిని ఇతరుల ఖాతాలో వేయడం ఏంటన్న ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. ఏ ఎన్నికల్లో గెలిచినా బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసే అమిత్‌ షా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎందుకు మాట్లాడలేదని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘మోదీ, అమిత్‌ షాలే అన్నింటికీబాధ్యత వహించాలి కదా’ అని ఓ నేత ప్రశ్నించారు. మంగళవారం నితిన్‌ గడ్కరీ కూడా ఇదే తరహాలో మాట్లాడిన సంగతి తెలిసిందే. తక్షణమే పార్టీలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, సరైన వ్యూహాన్ని రచిస్తూ నష్టనివారణ చర్యలు చేపట్టకపోతే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్న వారూ ఉన్నారు.

cbn protest 26122018

ధిక్కార స్వరాల వెనుక సంఘ్‌.. మోదీ, అమిత్‌ షా వ్యవహారాల శైలి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ధిక్కరణ స్వరాలు వినిపిస్తున్న వారి వెనుక ఆరెస్సెస్‌ ఉందని రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు. ఆరెస్సెస్‌ పెద్దలతో సన్నిహితంగా మెలిగే నితిన్‌ గడ్కరీ, సంఘ ప్రియ గౌతమ్‌ వంటి నేతలు మోదీ, అమిత్‌ షాపై నేరుగా వ్యాఖ్యలు చేయడమంటే వారి వెనుక సంఘ్‌ పెద్దలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ‘‘బీజేపీ బలంగా ఉన్న మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత కార్యకర్తల్లో స్థైర్యం దెబ్బతిన్నది’’ అని సంఘ్‌ నేత ఒకరు చెప్పారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read