రాష్ట్ర పునర్విభజన జరిగినప్పటి నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, 2019 జనవరి 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా హైకోర్టులు పనిచేయనున్నాయి. తెలంగాణకు 10 మంది, ఏపీకి 16 మంది న్యాయమూర్తులను కేటాయించారు. కాగా, మరోవైపు ఉద్యోగుల విభజన చర్యలు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు పదిహేను వందల మంది వరకు ఉన్న ఆఫీస్ సబార్డినేట్లు, రికార్డు అసిస్టెంట్లు, బైండర్లు, జమేదార్లు, దఫేదార్లు, బుక్ బేరర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లు, మిషన్ ఆపరేటర్లు తదితరులను రెండు హైకోర్టులకు కేటాయించనున్నారు. ఆయా ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించడం కూడా పూర్తయినట్టు సమాచారం.

highcourt 26122018

ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, తెలంగాణకు 10 మంది, ఏపీకి 16 మంది న్యాయమూర్తులను కేటాయించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా రాష్ట్రాలకు కేటాయించిన న్యాయమూర్తుల వివరాలు.. ఏపీ హైకోర్టుకు .. జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ సీహెచ్. ప్రవీణ్ కుమార్, జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ దామ శేషాద్రి నాయుడు, జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద్ రావు, జస్టిస్ టి. సునీల్ చౌదరి,

highcourt 26122018

జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి, జస్టిస్ జి.శ్యామ్ ప్రసాద్, జస్టిస్ కుమారి జే. ఉమా దేవి, జస్టిస్ నక్కా బాలయోగి, జస్టిస్ టి. రజనీ, జస్టిస్ దూర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు, జస్టిస్ కొంగర విజయ లక్ష్మీ, జస్టిస్ గంగారావు.... తెలంగాణ హైకోర్టుకు.. జస్టిస్ పులిగూర వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ ఎం. సత్య రత్న శ్రీ రామచంద్రరావు, జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ పొనుగోటి నవీన్ రావు, జస్టిస్ చల్లా కోదండరామ చౌదరి, జస్టిస్ బులుసు శివ శంకరరావు, జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్, జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు, జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ తొడుపునూరి అమరనాథ్ గౌడ్

Advertisements

Advertisements

Latest Articles

Most Read