మోడీ గారి న్యూఇయర్ గిఫ్ట్, ఈ సారి మోత మొగనుంది. ప్రతి ఇంట్లో వాడే కేబుల్ టీవీ చార్జీలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కేబుల్‌ బిల్లు నెలకు రూ.200 లోపు ఉంది. నగర ప్రాంతాల్లోనైతే రూ.250 వరకు పడుతోంది. కేబుల్‌ కనెక్షన్‌ ద్వారా సుమారు 300 నుంచి 350 వరకు చానెళ్లు ప్రసారం అవుతున్నాయి. వీటిలో 70 నుంచి 80 వరకు పే ఛానెళ్లు ఉన్నాయి. వార్తలు, వినోదాలు, ఆటలు అందించే చానెళ్లు హిందీ, తమిళ, మలయాళ చానెళ్లు 150 వరకు ప్రసారాలు జరుగుతున్నాయి. తాజాగా ట్రాయ్‌ నిర్ణరుంచిన ప్రకారం తొలి 100 ఎయిర్‌ ఫ్రీ చానె ళ్లకు రూ.130 తోడు జీఎస్టీ కలిపి చెల్లించాలి. వినియోగదారులు ఫ్రీచానె ళ్లు కాకుండా జెమిని, ఈ టీవీ, మాటీవీ, ఈటీవీ, స్పోర్ట్‌ లాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెళ్లు ఎంపిక చేసుకుంటే వాటికి అదనంగా చార్జీలు చెల్లించాలని కొత్త నిబంధనలు విడుదలయ్యాయి. వినియోగదారుడు కోరుకున్న చానెళ్లు, ప్యాకేజీల వారీగా ప్రసారాలు అందుతాయి.

cabel 22122018 2

ప్రస్తుతం కేబుల్‌ ద్వారా అందుతున్న చానెళ్లన్నీ ఈనెల 29తో ప్రసారాలు ముగుస్తాయి. 30వ తేదీ నుంచి ప్రస్తుతం అందుతున్న చానెళ్లు అన్నీ చూడాలంటే సుమారు రూ. 600 నుంచి రూ.800 వరకు చెల్లించాల్సి ఉంటుందని ట్రాయ్‌ నిర్ణయించిన ధరలు చెప్తున్నాయి. తెలుగు చానెళ్లు మాత్రమే కావాలనుకుంటే రూ.500 వరకు చెల్లించాలి. దీనికి తోడు ఇంగ్లీష్‌, స్పోర్ట్స్‌లాంటి చానెళ్లు కావాలంటే అదనంగా రుసుం చెల్లించాలి. ప్రస్తుతం వినియోగదారులు నెల మొత్తం టీవీ చూసిన తరువాత నెలాఖర్లో బిల్లు చెల్లించే వారు. ప్రస్తుత టారిఫ్‌ ప్రకారం ముందే డబ్బులు చె ల్లించి రీచార్జి చేయించుకోవాలి. ఈనెల 29వ తేదీ నుంచి వినియోగదారులు తమకు కావాల్సిన ప్యాకేజీలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

cabel 22122018 3

ఇప్పటివరకు నెల మొత్తం టీవీ ప్రసారాలు వీక్షించి నెలాఖరుకు బిల్లు చెల్లించేవారు. అదికూడా రోజుల తరబడి తిప్పించుకుని మరీ వినియోగదారులు బిల్లులు చెల్లిస్తున్నారని, ప్రస్తుతం వస్తున్న టారిఫ్‌ ప్రకారం తాము కేబుల్‌ టీవీలను నడిపించే పరిస్థితులు లేవని కేబుల్‌ టీవీ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న రూ. 200 బిల్లు చెల్లించడానికి గాను అనేక ఇబ్బందులు పడుతున్నారని, వసూలు చేసుకోవడానికి తాము సైతం ఇబ్బందులు పడుతున్నామని, అలాంటిది ఏకంగా నాలుగైదు రెట్లు బిల్లులను పెంచితే చెల్లించే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేబుల్‌ ప్రసారాలు అందించలేమని ఆవేదన చెందుతున్నారు. పే చానెళ్లను రెగ్యులర్‌ చేయాలని, సుప్రీం ఆదేశాల నేపధ్యంలో ఇదే అదునుగా ఇష్టారీతిన ధరలను పెంచుతున్నారని ఆపరేటర్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం విధిస్తున్న టారిఫ్‌ వల్ల కేవలం కేబుల్‌ ఆపరేటర్లు మాత్రమే గాకుండా డీటీహెచ్‌లు సైతం ఇదే పరిస్థితి ఎదుర్కోనున్నారని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read