సీఎం కేసీఆర్ రిటర్న్ గిప్ట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. శ్రీకాకుళంలో ధర్మపోరాట సభలో మాట్లాడుతూ సభికులను గిఫ్టుపై ప్రశ్నించారు. కేసీఆర్‌ బర్త్‌డే పార్టీ గిఫ్ట్‌ తీసుకోవాలా.. వద్దా తమ్ముళ్లూ అని ప్రశ్నించారు. ఎవరిని బెదిరిస్తున్నారని అడుగుతున్నానన్నారు. మీరంతా అండగా ఉంటే కొండనైనా ఢీకొంటానని స్పష్టం చేశారు. అధికారం తనకు ముఖ్యం కాదని, ఆత్మగౌరవమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. కష్టపడతా.. సంపద సృష్టిస్తా, అవమానాన్ని సహించనని చంద్రబాబు హెచ్చరించారు. అధికారం ముఖ్యం కాదు… ఆత్మగౌరవం ముఖ్యమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం అన్ని రాజకీయ పార్టీలను కలిశానన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ తో పోరాడాం.. ఇప్పుడు దేశం కోసం కలిసి పనిచేస్తున్నామన్నారు. బుంధేల్ ఖండ్ ప్యాకేజీ ఇస్తామని.. ఇవ్వలేదన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకున్నారన్నారు. ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ కోసం మన ఎంపీలు పోరాడుతూనే ఉన్నారన్నారు.

srikakulam 22122018 2

విద్వేషాలకు టీడీపీ దూరంగా ఉంటుందని, ఆయన రిటర్న్ గిఫ్ట్ ఏంటో చూడాలని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేసుకునే హక్కు ఉందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు టీడీపీని స్థాపించారని చంద్రబాబు గుర్తుచేశారు. ఈవీఎంలలో వీవీ ప్యాట్ లు సరిగా పనిచేయట్లేదని, పేపర్ బ్యాలెటే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఓటును ప్రోగ్రాం తయారు చేసే వ్యక్తికి అప్పజెప్పడం సరికాదన్నారు. అభివృద్ది చెందిన దేశాల్లో ఎక్కడా యంత్రాలపై ఆధారపడలేదన్నారు. కాకినాడలో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు సహకరించట్లేదన్నారు. ప్రైవేటు వ్యక్తులతో పెట్రో కెమికల్ కారిడార్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఫోన్టు, కంప్యూటర్లలో సమాచారం తీసుకునేలా చట్టం తెచ్చారన్నారు.

srikakulam 22122018 3

కేంద్రంపై తిరుగుబాటు తప్ప వేరే మార్గం లేదని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రానికి న్యాయం చేసేందుకే ఎన్డీయే నుంచి బయటికొచ్చామని, టీడీపీ ఎంపీలు చెప్పగానే రాజీనామాలు చేశారని చంద్రబాబు తెలిపారు. న్యాయం చేయమని అడిగితే దాడులు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఎంపీలు నోరు ఎత్తితే ఐటీ దాడులు చేయిస్తున్నారని, 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చారు.. మనకెందుకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్నామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేయడం నా జీవితాశయమన్నారు. 63శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని, రాష్ట్రానికి పోలవరం జీవనాడి. వంశధార, నాగావళి పూర్తి కావాలి” అని చంద్రబాబు ఆకాంక్షించారు. ధర్మవీరులకు జన్మనిచ్చిన వీరభూమి శ్రీకాకుళం అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిపోసిన నేల శ్రీకాకుళం అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read