నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ గ్రూప్‌-3 (పంచాయతీ కార్యదర్శి- గ్రేడ్‌-4) ఉద్యోగాల ప్రకటన వెలువడింది. ఆర్థికశాఖ అనుమతించిన 1000 పంచాయతీ కార్యదర్శుల పోస్టులతోపాటు అదనంగా 51 (గతంలో భర్తీకాకుండా ఉన్న పోస్టులు) భర్తీ చేసేందుకు శుక్రవారం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతోపాటు మహిళా శిశు సంక్షేమశాఖకు చెందిన ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1 ఉద్యోగ నియామకాల ప్రకటనా విడుదలైంది. కమిషన్‌ ఛైర్మన్‌ ఉదయ భాస్కర్‌ వివరాలను వెల్లడించారు.. మహిళా శిశు సంక్షేమశాఖలో ఎక్స్‌టెన్షన్‌: ఆఫీసర్‌-గ్రేడ్‌-1 పోస్టులు: 109, దరఖాస్తుల స్వీకరణ: ఈ నెల 28 నుంచి, దరఖాస్తుకు తుది గడువు: జనవరి 18, ప్రాథమిక పరీక్ష తేదీ: తరువాత ప్రకటిస్తారు, ప్రధాన పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 25

jobs 22122018

ఈ నోటిఫికేషన్లు సిద్ధం... అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ కమిషనరు (దేవాదాయ), ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ బాయిలర్స్‌ పోస్టుల భర్తీ ప్రకటనలూ సిద్ధంగా ఉన్నాయి. పూర్వ పద్ధతిలోనే గ్రూప్‌-1, గ్రూప్‌-2 భర్తీ: గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ఉత్కంఠ వీడింది. 2012లో నిర్ణయించిన ప్రకారం గ్రూప్‌-2 కింద గుర్తించిన ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌-1 పోస్టుల్లో 1బి కింద భర్తీ చేయాల్సి ఉంది. దీనిని అభ్యర్థులు వ్యతిరేకించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి పూర్వ పద్ధతిలోనే గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలను (2016) విడివిడిగా భర్తీ చేశారు. ఈ నిర్ణయాన్ని 2016 నోటిఫికేషన్లకే వర్తించేలా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు.

jobs 22122018

ఈ క్రమంలో కొత్తగా భర్తీ చేయనున్న గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ నిర్ణయాన్ని కమిషన్‌ కోరింది. పరిశీలన జరిపిన ప్రభుత్వం పూర్వ పద్ధతిలోనే విడివిడిగా భర్తీ చేయాలని శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిందని కమిషన్‌ సభ్యుడు రంగ జనార్దన వెల్లడించారు. వచ్చేవారం గ్రూప్‌-1, 2, ఇతర ఉద్యోగ నియామకాల ప్రకటనలు జారీ చేస్తామని పేర్కొన్నారు. జిల్లాల వారీగా గ్రూప్‌-3 పోస్టులు: * శ్రీకాకుళం: 114, * విజయనగరం: 120, * విశాఖపట్నం: 107, * తూర్పుగోదావరి: 104, * పశ్చిమగోదావరి: 25, * కృష్ణా: 22, * గుంటూరు: 50, * ప్రకాశం: 172, * నెల్లూరు: 63, * చిత్తూరు: 141, * అనంతపురం: 41, * కర్నూలు: 90, * కడప: 2 (క్యారీ ఫార్వర్డ్‌)

Advertisements

Advertisements

Latest Articles

Most Read