ప్రతిపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నది లోక్‌సభ ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రతిపాదిస్తూ డీఎంకే చీఫ్ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, అందరం కలిసి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. విశాఖపట్నం వేదికగా ఇవాళ జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో సీఎం పాల్గొని మాట్లాడారు. మహాకూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా ఎవరికి మద్దతిస్తారన్న దానిపై స్పందిస్తూ... ‘‘ఎన్నికల తర్వాత నా నిర్ణయం వెల్లడిస్తాను. ఇప్పటికిప్పుడే మేము దీనిపై మాట్లాడకూడదు. ఈ అంశంపై మేమంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది...’’ అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్‌కు మద్దతు ఇస్తున్నట్టు ఇటీవల ఎంకే స్టాలిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

cbn 22122018 1

కాగా ఇవాళ జరిగిన కాన్‌క్లేవ్‌లో ఎన్డీయే ప్రభుత్వ వైఖరి, రాష్ట్ర రాజకీయాలు, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు సహా పలు అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు విస్తృతంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా సహా ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన విభజన హామీలను ఎన్డీయే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. మరో పక్క, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి కూడా ఈ సమావేశంలో పాల్గున్నారు. దేశంలో నిరంకుశ పాలన అంతం కావాలంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఉద్వాసన పలకడం ఒక్కటే మార్గమని సీఎం నారాయణ స్వామి అన్నారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ సౌత్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

 

cbn 22122018 1

ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ‘ మేము(కాంగ్రెస్‌) ఆయనను బయటికి పంపాల్సిన అవసరం లేదు. ఆయన పాలన పట్ల ప్రతీ ఒక్కరిలో అసంతృప్తి రగులుతోంది. ఈ కారణంగా ఆయన సొంత మనుషులు, పార్టీ వాళ్లే ఏదో ఒకరోజు ఆయనను బయటికి నెట్టివేస్తారు. కేవలం ఇద్దరు మనుషుల చేతుల్లో బీజేపీ నలిగిపోతుందని ఆ పార్టీ నాయకులే నా దగ్గర గోడు వెళ్లబోసుకున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన పదవి నుంచి దిగిపోక తప్పదు’ అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రులతో మాట్లాడే సమయమే ఉండదని నారాయణ స్వామి విమర్శించారు. గతంలో ఆయన అపాయింట్‌మెంట్‌ కోసం ఆరు సార్లు ప్రయత్నిస్తే కనీసం రెండుసార్లైనా దొరికేది.. కానీ ఇప్పుడు పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ మోదీకి నేనంటే ఎంతో ఇష్టం. అందుకే కిరణ్‌బేడీని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పంపించారు’ అని నారాయణ స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read