హైకోర్టు ఆదేశాల మేరకు హాయ్‌ల్యాండ్‌ ఆస్తులను 2019 ఫిబ్రవరి 8వ తేదీలోపు వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అగ్రిగోల్డ్‌ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై మంత్రిమండలి సమావేశంలో చర్చించారు. హాయ్‌ల్యాండ్‌ వేలంపై హైకోర్టు ఆదేశాలను అధికారులు మంత్రి మండలి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ..‘‘బాధితులకు ఎంత త్వరగా న్యాయం జరిగితే ఆ కుటుంబాల్లో అంత భరోసా వస్తుంది. హాయ్‌ల్యాండ్‌తో పాటు మిగతా అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం త్వరితగతిన జరిగేలా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలి. ఈ నెల 28న జరగబోయే విచారణలో హైకోర్టుకు వాస్తవ వివరాలను నివేదించాలి. ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేసేలా చూడాలని’ సూచించారు.

agrigold 21122018 2

అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించిన హాయ్‌లాండ్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఉహాయ్‌లాండ్ ఆస్తుల విలువ 600 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం చెప్పటంతో, హైకోర్టు ఆ ధర ఖరారు చేసింది. హైకోర్టు ఈ ఆస్తులను అమ్మి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాలని ఆదేశించింది. శుక్రవారం ఉమ్మడి హైకోర్టు జస్టిస్ రామసుబ్రమణ్యం, జస్టిస్ బట్‌తో కూడిన ధర్మాసనం విచారిస్తూ అగ్రిగోల్డ్ యాజమాన్యం సూచించినట్టుగా హాయ్‌లాండ్ విలువ రూ 1,000 కోట్ల రూపాయలుగా సూచించందని, అయితే, వాటి విలువ 600 కోట్ల రూపాయలుగా నిర్ధారించడం జరిగిందని కోర్టు స్పష్టం చేసింది. ఎస్‌బీఐ మాత్రం 550 కోట్ల రూపాయల విలువగా పేర్కొందని కోర్టు తెలిపింది. 2019 ఫిబ్రవరి 9వ తేదీన కోర్టు హాల్‌లో హాయ్‌లాండ్ కొనుగోలుకు సీల్డ్ కవర్‌లో బిడ్డర్ల వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

agrigold 21122018 3

బిడ్డర్ల వ్యవహారాలను అంతా ఎస్‌బీఐ పర్యవేయణలో జరగాలని కోర్టు సూచించంది. అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేయడానికి ముందకు వచ్చిన జీఏస్‌ఎల్ గ్రూపు ఆతర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. హైకోర్టు సమయాన్ని వృథా చేసినందుకు జీఎస్‌ఎల్ గ్రూపుకు మూడు కోట్ల రూపాయలు జరిమానా విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హాయ్‌లాండ్‌లోని కొంత భూమని ఎస్‌బీఐ వద్ద తనఖా పెట్టినందున, తదుపరి ఆ ఆస్తిని పూర్తిగా వేలం వేసిన అనంతరం ఆ బ్యాంకుకి ఎంత ఇవ్వాలి, అగ్రిగోల్డ్ బాధితులకు ఎంత ఇవ్వాలి అనే విషయాలను ఖరారు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఇలావుంటే, కోర్టు నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేశారు. అయితే హాయ్‌లాండ్ పై ప్రేమ చూపించిన వైసీపీ, బీజేపీ ఇప్పుడు మాత్రం అడ్డ్రెస్ లేరు. ఎందుకంటే ఇప్పుడు బాధితులకు న్యాయం జరుగుతుంది, ఎంత రెచ్చగొట్టినా ప్రయోజనం ఉండదు కాబట్టి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read