మీ కంప్యూటర్‌ లేదా మీ స్మార్ట్‌ఫోన్‌లోని సమాచారం మీకు మాత్రమే సొంతం కాదు! ఆవగింజంత అనుమానం తలెత్తినా... మీ కంప్యూటర్‌లోకి చొరబడిపోవచ్చు! అనుమానాలు, ఆవకాయబద్దలతో సంబంధం లేకున్నా సరే... ఓ కన్నేసి ఉంచవచ్చు! ఒకరూ ఇద్దరూ కాదు... దేశంలోని పది విభాగాలకు కేంద్ర ప్రభుత్వం ఆ అధికారం కట్టబెట్టింది. ‘ఏదైనా ఒక కంప్యూటర్‌లో ఉన్న, కంప్యూటర్‌ ద్వారా వచ్చిన మొత్తం సమాచారం’ ఇక నిఘా పరిధిలోకి వచ్చినట్లే! దీనిపై కేంద్ర సైబర్‌, సమాచార భద్రత విభాగం తరఫున హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా ఆదేశాలు జారీ చేశారు. సీబీఐ నుంచి ‘రా’ వరకూ మొత్తం పది సంస్థలకు ఈ అధికారం లభించింది. హోంశాఖ ఉత్తర్వుల్లో ‘కంప్యూటర్‌’ అని ఒక్కముక్కలో తేల్చేసినా అది అక్కడికే పరిమితంకాదు! పీసీ, డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌, స్మార్ట్‌ఫోన్‌ సహా అన్నిరకాల ‘ఎలకా్ట్రనిక్‌ స్టోరేజ్‌ డివైజ్‌’లు నిఘా పరిధిలోకి వస్తాయి

modi 22122018 2

దీని ప్రకారం... ఆ సంస్థల అధికారులు ఒక కంప్యూటర్‌లో స్టోర్‌ చేసిన, ఒక కంప్యూటర్‌లో తయారు చేసిన (జనరేట్‌), ఒక కంప్యూటర్‌ నుంచి మరొకచోటికి వెళ్లిన (ట్రాన్స్‌మిట్‌), మరో కంప్యూటర్‌ నుంచి వచ్చిన (రిసీవ్‌) చేసుకున్న అన్ని రకాల సమాచారంపై ఎలాంటి అనుమతులు లేకుండానే నిఘా వేయవచ్చు. ఇంటర్నెట్‌ ద్వారా పంపించే సమాచారాన్ని మధ్యలోనే అడ్డుకోవచ్చు. ఎన్‌క్రిప్టెడ్‌ సమాచారాన్ని ‘డీక్రిప్ట్‌’ చేయవచ్చు. ఆ పది సంస్థల ప్రతినిధులకు కంప్యూటర్‌ యజమాని (యూజర్‌), సంస్థ, లేదా సర్వీస్‌ ప్రొవైడర్‌ సహకరించాల్సిందే! కూడదు అని మొండికేస్తే... ఏడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. భారీగా జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం పది సంస్థల అధికారులు దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరి ‘కంప్యూటర్‌’నైనా తనిఖీ చేయవచ్చు. వాటిపై నిఘా వేయవచ్చు.

modi 22122018 3

కంప్యూటర్లలో తయారు చేసి పంపిన, స్వీకరించిన ఏ సమాచారాన్ని అయినా తనిఖీ చేసి విశ్లేషించడంతో పాటు దాన్ని అడ్డుకునే అధికారాన్ని దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ అత్యవసర ఆదేశాలు జారీ చేయడం దారుణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని చంద్రబాబునాయుడు విమర్శించారు. మోదీ పాలనలో వ్యక్తిగత హక్కులకు కూడా భరోసా లేకుండా పోయిందని మళ్లీ రుజువైందని చంద్రబాబు మండిపడ్డారు. ముందస్తు నోటీసులు లేకుండా ఆర్డినెన్స్‌ తెచ్చారని.. కేంద్రం ఆర్డినెన్స్‌ని ఉపసంహరించుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కంప్యూటర్లు, మొబైల్స్‌లోని డేటాను కేంద్ర నిఘా సంస్థలు యాక్సిస్‌ చేయొచ్చు అని ఆదేశాలు ఇవ్వడం దారుణమని చంద్రబాబు అన్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read