ప్రభుత్వ పథకాలు అందరికి అమలు చేయడం, అభివృద్ధిలో తణుకు నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచింది. ఎమ్మెల్యేల పనితీరులో ఆరిమిల్లి రాధాకృష్ణ మరోసారి మొదటి స్థానంలో నిలిచారు. ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడం, నియోజకవర్గంలో ప్రజలకు సంక్షేమ ఫలాల సంతృప్తి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన జాబితాలో తొలి పది మంది ఎమ్మెల్యేలలో రాధాకృష్ణ మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిలిచారు. వారికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి రావడానికి మరింత కృషి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఉత్తమ ఎమ్మెల్యే జాబితాలో ప్రథమస్థానం రావడంపై ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 1200 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో ముందుం చామన్నారు. సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అందిస్తున్నామన్నారు. ప్రథమ స్థానంలో నిలవడానికి కారణమైన నియోజకవర్గ ప్రజలకు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు ప్రకటించిన టాప్ 10 ఎమ్మల్యేలు వీరే... ఆరిమిల్లి రాధాకృష్ణ-(తణుకు)-90%... నిమ్మల రామానాయుడు-(పాలకొల్లు)-89%... గద్దె రామ్మోహన్-(విజయవాడ తూర్పు)-88%... శ్రీరాం రాజగోపాల్-(జగ్గయ్యపేట)-87.5%... కింజరాపు అచ్చెన్నాయుడు-(టెక్కలి)-87%... బోడె ప్రసాద్-(పెనమలూరు)-85%... ధూళిపాళ్ల నరేంద్రకుమార్-(పొన్నూరు)-84.5%... కోళ్ల లలితకుమారి-(శృంగవరపు కోట)-84%... ఏలూరి సాంబశివరావు-(పర్చూరు)-83.5%... యామిని బాల-(సింగనమల)-83%.. స్థానికంగా అందుబాటులో ఉండటం, సమస్యలను పరిష్కరించడం, ప్రభుత్వ పథకాల అమలు తీరు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, మొత్తం పనితీరు, ఇలా వివిధ అంశాల పై అభిప్రాయ సేకరణ చేశారు.