ప్రధాని మోదీకి గుజరాత్‌ ప్రాజెక్టులపై ఉన్న మక్కువ.. పోలవరంపై లేదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.53వేల కోట్లు అవసరమని, కేంద్రం మాత్రం దీనిపై ఎలాంటి ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు. ప్రాజెక్టును చూసేందుకు ప్రధాని మోదీ ఒక్కసారైనా రాలేదని ఆయన విమర్శించారు. పోలవరం స్పిల్‌వేలో క్రస్ట్‌ గేట్లను అమర్చే ప్రక్రియను సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన రైతు సదస్సులో సీఎం మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు దేశంలోనే అద్భుతంగా తయారవుతుందని చెప్పారు. కాంక్రీటు పనులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయని, వచ్చే నెల 7న గిన్నీస్‌ బుక్‌ రికార్డు సాధించేలా కాంక్రీట్‌ పనులు నిర్వహించనున్నామని తెలిపారు.

polavaram kcr 24122018

ఆ రోజు 28 వేలకు పైగా క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసి ప్రపంచ రికార్డు సృష్టించాలని సంకల్పించామని వివరించారు. దేశంలోనే వేగంగా పూర్తి చేసే ప్రాజెక్టుగా పోలవరం నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పనులు వేగంగా పూర్తి చేసిన ఘనత అధికారులు, ఇంజినీర్లు, నవయుగ సంస్థకు దక్కుతుందన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమెలాగో పట్టిసీమతో నిరూపించామన్నారు. పోలవరాన్ని సకాలంలో పూర్తి చేసి నీరందిస్తామని చెప్పారు. ప్రాజెక్టులో 63 శాతం నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు. నిర్మాణ దశలోనే పోలవరం పర్యాటక ప్రాంతంగా మారిందని, రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రాజెక్టును చూసేందుకు వస్తున్నారన్నారు.

polavaram kcr 24122018

ఏపీలో అభివృద్ధిని అడ్డుకోవాలని తెలంగాణ కేసీఆర్ చూస్తున్నారని, ఒడిశా సీఎంతో కలిసి పోలవరం నిర్మాణానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవద్దని.. నిర్మాణానికి సహకరించాలని ఇదే వేదిక నుంచి కోరుతున్నానని చెప్పారు. పోలవరాన్ని అడ్డుకోవద్దని ఇతర రాష్ట్రాలనూ కోరుతున్నట్లు తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ పోలవరంపై దుష్ప్రచారం చేసిందని, అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. భూసేకరణతోపాటు పునరావాసాన్ని అడ్డుకునేందుకు యత్నించారని సీఎం ఆరోపించారు.‌

Advertisements

Advertisements

Latest Articles

Most Read