ఒక పక్కన కళ్ళ ముందు వాస్తవం కనిపిస్తుంది. వారం వారం చంద్రబాబు చేసే సమీక్షలు, డిటైల్డ్ గా వార్తల్లో వస్తున్నాయి. ప్రతి వారం జరిగే పోలవరం రివ్యూ డీటెయిల్స్ అన్నీ వెబ్సైటులో ఉన్నాయి. కొన్ని వేల మంది రాష్ట్రం నలు మూలల నుంచి వచ్చి, పోలవరం పనులు జరుగుతున్న తీరు చూసి ఆశ్చర్యపోతున్నారు. మరో పక్క, జగన పార్టీ A2 విజయసాయి, రోజుకి ఒక ప్రశ్న పోలవరం మీద అడుగుతూ ఉంటాడు. ఏదైనా లోపం దొరుకుతుందేమో, చంద్రబాబు పై విరుచుకుపడవచ్చు అని. మరో పక్క కేంద్రం నుంచి పోలవరం పనులు జరుగుతున్న తీరు పై అవార్డులు వస్తున్నాయి. కేవలం మరో నాలుగు నెలల్లో, నీళ్ళు ఇవ్వటానికి సర్వం సిద్ధమవుతుంది.
కళ్ళ ముందు ఇంత వాస్తవం కనిపిస్తుంటే, జగన్ మోహన్ రెడ్డి గారికి మాత్రం, కళ్ళకు ఏమి కనపడటం లేదు, చెవులకు ఏమి వినపడటం లేదు. లేకపోతే అన్నీ చూసి కూడా అబద్ధాలు ఆడుతున్నాడు అనుకోవాలి. అది కూడా, తన ఇష్ట దైవం జీసెస్ పుట్టిన రోజు నాడు, క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న వేళ, పచ్చి అబద్ధాలు ఆడుతూ, ప్రజలను మభ్య పెడుతున్నాడు. ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ లో మొదటి గేటుని అమర్చే కార్యక్రమం చంద్రబాబు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రమంతా ఈ విషయం పై సంతోషం వ్యక్తం చేస్తుంటే, రాష్ట్రం బాగుపడుతుంది అని కొంత మంది ఏడుస్తున్నారు. వాళ్ళలో ఒకటి కేసీఆర్, రెండు జగన్. పవన్ అత్తగారింటికి యూరోప్ వెళ్ళాడు కాని, ఉంటే ఆయన ఏమి చేసేవాడో.
కేసీఆర్, ఒరిస్సా వెళ్లి పోలవరం పై కుట్రలు చేస్తుంటే, జగన్ మోహన్ రెడ్డి మాత్రం, ఇక్కడే ఉంటూ, పోలవరంలో అసలు పునాదులే పూర్తికాలేదు అంటూ, పబ్లిక్ మీటింగ్ లో అవాస్తవాలు చెప్తున్నాడు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు రోజుకొక సినిమా చూపిస్తున్నారని అన్నారు. పునాదులు కూడా పూర్తవ్వని పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు గేట్లు పెడతారట అంటూ ఎద్దేవా చేస్తున్నాడు. ఒక పక్క కళ్ళ ముందు టీవీల్లో అన్నీ కనిపిస్తుంటే జగన్ ఇలా మాట్లాడుతున్నాడు. అయినా పునాదులు పూర్తి కాకుండా, గేటులు ఎలా బిగిస్తారు ? ప్రజలు మరీ అంత పిచ్చి వాళ్ళు లాగా కపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకు 62.8శాతం పనులు పూర్తయ్యాయి, జనవరి 6-7 తేదీల్లో 28 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేసి రికార్డు సృష్టిస్తారు. స్పిల్ వే పనులు 75 శాతం పూర్తి అయ్యాయి. ఇంత జరుగుతుంటే, అసలు పోలవరం ప్రాజెక్ట్ కు పునాదులే పూర్తి కాలేదు అంటుంటే, అదీ క్రిస్మస్ పండుగ రోజు అబద్ధాలు ఆడితే, ఆ ప్రభువు మిమ్మల్ని క్షమిస్తాడా జగన్ గారూ ? కొంచెం వాస్తవాలు చెప్పండి.