మన రాష్ట్రంలో ఒక బ్యాచ్ ఉంది. రాష్ట్రం బాగుంటే ఏడుస్తారు, రాష్ట్రం ఏడిస్తే నవ్వుతారు. పక్క రాష్ట్రంలో మనల్ని కుక్కలు అన్నాడు గెలిస్తే, సంబరాలు చేసుకుంటారు. ప్రక్రుతి విపత్తులు వస్తే, మమ్మల్ని ఓడించినందుకు తగిన శాస్తి జరిగింది అంటూ, సంబర పడతారు. ఇలాంటి వాళ్ళని ఏమనాలో ప్రజలే నిర్ణయించాలి. అయితే నిన్న రాష్ట్రంలో జరిగిన సంఘటనతో మరో మారు ఈ బ్యాచ్ ఆక్టివేట్ అయ్యింది. నిన్న పోలవరం జీవనాడి పోలవరంలో మొదటి గేటు బిగింపు ప్రక్రియ మొదలైంది. దీంతో ఒక పార్టీ ఏమో అసలు, పోలవరంలో పునాదులు కూడా అవ్వలేదు అంతా షో అంటూ, తన పత్రికలో రాసుకుంది. ఇంకో పార్టీ కోతి మూక ఏమో, అసలు పోలవరంలో గేటులు ఎందుకు, అంటూ తిక్క సేనతో సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ, వికృత ఆనందం పొందుతున్నారు. ఎవరైనా రాష్ట్రంలో శుభం జరుగుతుంటే సంతోషిస్తారు, కాని మనకు మాత్రం ఏడుస్తారు. రాష్ట్రానికి మంచి జరిగినా ఏడుపే, ఎందుకంటే ఆ మంచి చేస్తుంది చంద్రబాబు కదా. అందులోనూ పోలవరం లాంటి ప్రాజెక్ట్ పూర్తి చేస్తే, వాళ్ళ సొంత రాష్ట్రం తెలంగాణాకు ఇబ్బంది కదా, అందుకే ఏపిలో పార్టీ టైం రాజకీయాలు చేసే, ఈ బ్యాచ్ మన మీద పడి ఏడుస్తూ ఉంటారు.
అయినా, మొదటి గేటుకే ఇన్ని ఆర్తనాదాలు ఉంటే, ఇంకా 48 ఉన్నాయి, ఇవన్నీ పూర్తవుతూ ఉంటే ఏమైపోతారో. ఇక ఈ గేట్ల వివరాలు తెలిస్తే, మతి పోతుంది. స్పిల్‌వేలో మొత్తం 52 బ్లాకుల్లో 48 గేట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ గేట్ల తయారీకి 18 వేల టన్నుల ఇనుము వినియోగిస్తున్నారు. దేశంలోనే అతిపెద్దదైన ఈ ప్రాజెక్టులో ఎక్కడా లేని విధంగా అతి భారీ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. క్కొక్క గేటుకు 300 టన్నుల ఐరన్ వాడుతున్నారు. గేటు వెడల్పు 16 మీటర్లు కాగా.. ఎత్తు 20 మీటర్లు. ఒక గేటు తయారీకి సుమారు నెల రోజుల సమయం పడుతుంది. అదే గేటును స్పిల్‌వేలో బిగించడానికి 60 రోజులు పడుతుంది. కాగా.. అన్ని గేట్ల బిగింపు ప్రక్రియ సమాంతరంగా కొనసాగనుంది. ఇప్పటికే గేట్ల తయారీ పనులు 62.48 శాతం పూర్తయ్యాయి. ఇందుకు అవసరమైన 192 హారిజాంటల్ ఆగర్స్ సిద్ధం చేశారు. ఇంకోవైపు.. జపాన్ నుంచి రావలసిన 96 బుష్‌లు ఇప్పటికే వచ్చేశాయి. జర్మనీ నుంచి హైడ్రాలిక్ సిలిండర్లు రావలసి ఉంది. 00 టన్నుల బరువున్న గేటును పైకి లేపడానికి అత్యంత సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగిస్తున్నారు. దీని కోసం స్పిల్‌వేలోనే ఒక కంట్రోల్‌రూమ్ ఏర్పాటుచేసి దీనిలో కంట్రోల్ ప్యానెల్ స్కాడా సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు.
ఈ స్కాడా సిస్టమ్‌లో ప్రాజెక్టు నుంచి.. పెరిగిన గోదావరి పరివాహక ప్రాంతం మొత్తాన్నీ ఫీడ్ చేస్తారు. దీనివల్ల ఎగువన ఎంత వర్షం కురుస్తుంది.. ఎంత వరద ఎన్ని గంటల్లో పోలవరం జలాశయాన్ని చేరనుందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. దీంతో గేట్లు ఎంత మేర పైకి లేపి.. దిగువకు వరదనీరు విడుదల చేయాలో తెలిసిపోతుంది. ఆటోమేటిగ్గా స్కాడా సిస్టమ్ ద్వారా గేట్లను పైకి లేపుతారు. బెకం కంపెనీ ఈ పనులు చేస్తోంది. ఇక నెలకు ఆరు గేట్లు చొప్పున గేట్లు బిగింపు పని ప్రారంభించి పనులు వేగం చేసి 48 గేట్లు ఏర్పాటు పూర్తి చేస్తామని, జలవనరుల కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ అన్నారు. ప్రాజెక్టును పూర్తిచేసి జూన్‌లో గ్రావిటీ ద్వారా నీరందిస్తామని స్పష్టం చేశారు. 2016 డిసెంబరు 30న స్పిల్‌వేలో కాంక్రీటు పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని, ఈ రెండేళ్లలో ఎంతో పని జరిగిందన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి కావాలంటే తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలపాలని చంద్రబాబు ముందుచూపుతో ఆలోచించారని.. ఆ దిశగానే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించారని జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.