గత ఏడాది వంశధార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై వివరణ కోరుతూ ఒడిశా, కేంద్రప్రభుత్వాలు పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం ట్రిబ్యునల్ సోమవారం జిల్లాకు వచ్చింది. కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల మధ్య జల వాటాలు, ముంపు గ్రామాలు, వరదపోటు వంటి అంశాలపై జరగుతున్న విదానానికి చివరి మజిలీ ఆరంభమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన వంశధార ట్రిబ్యునల్ సోమవారం మరోసారి శ్రీకాకుళం జిల్లాలో వంశధార రిజర్వాయర్ ప్రాంతాలైన హిరమండలం, కొత్తూరు, భామిని ప్రాంతాల ప్రజలతో నేరడి బ్యారేజీ నిర్మాణంపై గల అభిప్రాయాలను రికార్డు చేసారు. గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు కాట్రగడ్డ వద్ద సైడ్‌వీయర్ నిర్మాణ ప్రాంతాన్ని ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ముకుందకమ్ శర్మ, సభ్యులు పరిశీలించారు. అక్కడ సైడ్‌వీయర్ నిర్మాణం జరిగితే ఒడిషా రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వ్యవసాయభూములు వరదపోటుకు గురవుతాయన్న వివరాలను అడికి తెలుసుకున్నారు. ఏ మేరకు ఒడిషా నుంచి దిగువప్రాంతానికి వచ్చే నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించుకుంటుందన్న అంశాలను కలెక్టర్ ట్రిబ్యునల్‌కు వివరించారు.

water 25122018 2

గ్రామాలు, మండలాల వారీగా రైతులు, అక్కడ ప్రజలను ట్రిబ్యూనల్ పలు అంశాలపై వారి వాయిస్‌ను రికార్డులను చేసింది. 2012, 2013లో రెండు పర్యాయాల వచ్చిన ఈ ట్రిబ్యునల్ అప్పట్లోనే ఒడిశా అభ్యంతరాల్లో వాస్తవాలు లేవన్న విషయాన్ని గ్రహించింది. అందుకే, వంశధార జలవివాదంలో అనుకూలమైన తీర్పు పొందిన ఆంధ్రప్రదేశ్ ఇకపై ఒడిశాతో జలజగడం పూర్తిగా సమసిపోయేలా మరో వాదనను ట్రిబ్యునల్ ముందు వినిపించగా, సోమ, మంగళవారాల్లో ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్లో వంశధార జలవివాదానికి తెరవేసేలా తుది ప్రయత్నంలో జిల్లా అధికారులంతా నిమగ్నమయ్యారు. సోమవారం ఆంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో హిరమండలం, గొట్టాబ్యారేజీ, కాట్రగడ్డ సైడ్‌వీయర్ నిర్మాణ జరిపే ప్రాంతాలతోపాటు నేరడి బ్యారేజీ ప్రాంతంలో గల ప్రజలతో ట్రిబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ ముకుందకం శర్మ నేరుగా మాట్లాడారు. అలాగే, ఆయనతోవచ్చిన సభ్యులు కూడా పలు అంశాలపై ఆరా తీసి రికార్డు చేసారు. ఒడిశాకు కేవలం 200 క్యూసెక్కుల నీటివనరులు అవసరమని, అదే ఆంధ్రాలో 4000 క్యూసెక్కులు అరవై రోజులు నిల్వ చేసుకునే అవకాశం వంశధార అనుసంధానంతో కాట్రగడ్డ వద్ద సైడ్‌వీయర్ నిర్మాణంతో ఉంటోందని ట్రిబ్యునల్ ఛైర్మన్‌కు తెలిపారు.

water 25122018 3

2000 ఆయకట్టుకు మాత్రమే ఒడిశా సర్కార్ నీటివనరులు అడిగారని, అదేవిధంగా జలవాటాలు జరిగితే 15 టి.ఎం.సి.ల నీటిని అధనంగా నేరడి బ్యారేజీ వద్ద 30 టి.ఎం.సి.ల నీటి నిల్వలు చేసే అవకాశం శ్రీకాకుళం జిల్లాకు ఉంటోందని వివరించారు. ఆంధ్రా 30 టి.ఎం.సి.ల నీటిని వినియోగించుకునేందుకు అభ్యంతరాలు ఒడిశాకు ఏమీ లేవని, ఆ ప్రభుత్వానికి కలిగిన అపోహాలన్నీ తొలగించేలా ట్రిబ్యునల్ ముందు కలెక్టర్, వంశధార ఇంజనీర్లు అంశాలన్నీ వివరించారు. 74 - 76 మీటర్లు ఎత్తులో వంశధార రిజర్వాయర్‌లో నీటి నిల్వలు చేస్తే ఒడిషాలో భూములు ముంపునకు గురి అవుతాయన్నది అక్కడ అధికారుల అపోహాలని వాటి మూలంగా ముంపునకు గురైన గ్రామాలకు, వ్యవసాయ భూములకు పరిహారం ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చేందుకు అంగీకరించిందని, అటువంటి పరిస్థితుల్లో ఒడిశా ప్రభుత్వానికి జరిగే నష్టం మరేవిధంగా లేదని కలెక్టర్ ట్రిబ్యునల్ చైర్మన్, సభ్యులకు వివరించారు. మంగళవారం ఒడిషా రాష్ట్రంలో ట్రిబ్యునల్ పరిశీలన అనంతరం వంశధార జలవివాదంపై తుది తీర్పు రానున్నది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read