ఈ రోజు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్‌ చేశారు. పెథాయ్‌ తుపాను దృష్ట్యా రాష్ట్రంలో చేపట్టిన ముందస్తు చర్యల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంకు సూచించారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని చర్యలు తీసుకున్నామని, సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు. మరోవైపు తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. శ్రీహరి కోటకు 720 కి.మీల దూరంలో పెథాయ్‌ తుపాను కేంద్రీకృతమైంది. కాకినాడ - విశాఖ మధ్య ఈ తుపాను ఈ నెల 17న తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

governer 15122018

గంటకు 16కి.మీల వేగంతో తీరంవైపు తుపాను కదులుతోంది. ఈ తుపాను గమనాన్ని ఏపీ సర్కార్‌ ఏర్పాటు చేసిన ఆర్టీజీఎస్‌ జాగ్రత్తగా గమనిస్తోంది. అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. తుపాను పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆర్టీజీఎస్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. పరిష్కార వేదిక 1100 కాల్ సెంటర్‌ నుంచి తుపాను జాగ్రత్తల సందేశాలను జారీ చేస్తున్నారు. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజలకు నింతరం హెచ్చరికలు పంపుతున్నారు. తుపాను సంబంధిత విభాగాల అధికారులు ఆర్టీజీఎస్‌లో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు.

governer 15122018

తుఫాను పరిస్థితిని ఎదుర్కొనటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక కాల్ సెంటర్ నుంచి తుఫాన్ కు సంబంధించిన సందేశాలు జారీ చేస్తున్నారు. ఐవిఆర్ఎస్ ద్వారా ప్రజలకు నిరంతరం హెచ్చరికలు జారీ అవుతున్నాయి. మత్స్యకారుల పడవలన్నీతీరంలోనే నిలిచిపోయాయి. తుఫాను నేపధ్యంలో ధాన్యపు కొనుగోలు కేంద్రాల్ని రాత్రిపూట కూడా పనిచేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రోజు పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి సిద్దంగా వుండాలని ఆదేశించారు. ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రపునేటా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read