టెలివిజన్‌, మొబైల్‌ ఎల్‌ఈడీ స్ర్కీన్లు, పరికరాలను తయారు చేసే ప్లాంట్లు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామంటూ ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి. తిరుపతి ఎలక్ట్రానిక్ హబ్‌లో వీటిని స్థాపిస్తామంటూ ఆయా సంస్థలు తమ ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన వోల్టాస్‌ రూ.653 కోట్ల పెట్టుబడితో 1680 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పింది. మరో ప్రముఖ సంస్థ టీటీఈ కూడా రూ.65.03 కోట్లు, ప్యానెల్‌ ఆప్టోడిస్‌ప్లే టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పీవోటీపీఎల్‌) రూ.1229.34 కోట్లు పెట్టుబడిగా పెడతామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖకు ప్రతిపాదనలు పంపాయి. వీటికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ఆమోదం తెలియజేసింది. ఈ సంస్థలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపైనా స్పష్టత ఇచ్చింది. ఎస్‌ఐపీసీ చేసిన సిఫారసులు సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) ఆమోదించింది.

electronics 14122018 1


భారత్‌కు చెందిన ప్రఖ్యాత వోల్టాస్ ఎలక్ట్రానిక్‌ కంపెనీ రేణిగుంట ఈఎంసీ-2లో వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.653 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కూలర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు తయారు చేస్తున్న ఈ కంపెనీ ఏర్పాటుతో 1,680 మందికి ఉపాధి లభించనుంది. చైనాకు చెందిన అప్టోడిస్ల్పే టెక్నాలజీ ప్రయివేట్‌ లిమిటెడ్‌ (పీవోటీపీఎల్‌) రేణిగుంట ఈఎంఎస్‌ క్లస్టర్‌లో 70 ఎకరాల్లో రూ.308 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. టెలిఫోన్‌, టెలివిజన్‌, మొబైల్‌ ఫోన్‌, రిఫ్రిజిరేటర్‌, వాషింగ్‌ మెషిన్‌, ఎయిర్‌ కండీషనర్లు ఈ సంస్థ తయారు చేయనుంది. ఉపాధి కల్పనపై ఈ కంపెనీ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. చైనాకు చెందిన మరో ఎలక్ట్రానిక్‌ కంపెనీ పేనల్‌ ఆప్టోడిస్ల్పే టెక్నాలజీ రేణిగుంటలో 70 ఎకరాల్లో రూ.1,229 కోట్ల పెట్టుబడులతో కంపెనీని ఏర్పాటు చేయనుంది. ఎల్‌సీడీ ప్యానళ్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు తయారు చేసే ఈ కంపెనీ ప్రారంభంతో ప్రత్యక్షంగా 700 మందికి, పరోక్షంగా 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నిర్వాహకులు మూడు విడతల్లో ప్రాజెక్టుని పూర్తి చేయనున్నారు.

 

electronics 14122018 1

ముఖ్యమంత్రి సమక్షంలో ఒకటి, రెండు రోజుల్లో నిర్వహించే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించి తదుపరి నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ కంపెనీల ఏర్పాటుకు తిరుపతి సమీపంలోని రేణిగుంటలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రెండు ఎలక్ట్రానిక్‌ క్లస్టర్లు అభివృద్ధి చేశారు. వీటిలో ఎక్కువగా చైనాకు చెందిన ప్రఖ్యాత ఎలక్ట్రానిక్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇదే ప్రాంతంలో టెలిఫోన్‌ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ (టీసీఎల్‌) కంపెనీకి ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. ఇప్పుడు మరో మూడు ప్రఖ్యాత కంపెనీలు ఇక్కడే పెట్టుబడులు పెట్టేందుకు తాజాగా పరిశ్రమలశాఖను ఆశ్రయించాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read