ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి జాతీయ రాజకీయాల్లో తొలి విజయం. ప్రథమంగా దేశంలో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఒకటైతే, బీజేపీయేతర జాతీయ రాజకీయ పార్టీలను ఏక తాటిపై, ఒకే వేదికపైకి తేవాలన్న ప్రయత్నాలకు శుభారంభం పడింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి సిద్ధపడిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ నేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లు. ఎడమొఖం పెడముఖంగా ఉన్న మాయావతి, అఖిలేష్ యాదవ్ , కాంగ్రెస్ లను కలిపి, మోడీని దెబ్బ కొట్టాలన్న చంద్రబాబు ప్రయత్నం ఫలించింది. ఢిల్లీ పర్యటనలో మాయవతితో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాణాళికకు మాయావతి ఆమోదం తెలిపారు.

mayawati 12122018 2

మొన్న జరిగిన ఎన్నికల్లో, మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటుకు తాము మద్దతు ఇస్తున్నట్టు బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రకటించారు. మధ్య ప్రదేశ్‌లో మెజారిటీ మార్కుకు కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల దూరంలో నిలిచిపోయిన నేపథ్యంలో, ఆ పార్టీ ఎస్పీ, బీఎస్పీ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కోరింది. దీంతో అక్కడ విజయం సాధించిన ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తున్నట్టు మాయావతి పేర్కొన్నారు. ఇవాళ ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ అనుసరిస్తున్న చాలా విధానాలకు మేము వ్యతిరేకమైనప్పటికీ, మధ్య ప్రదేశ్‌లో ఆపార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం. రాజస్థాన్‌లో కూడా అవసరమైతే మద్దతు ఇచ్చేందుకు సిద్ధం...’’ అని ఆమె ప్రకటించారు.

mayawati 12122018 3

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాలు గద్దె దిగడంపై ఆమె స్పందిస్తూ..‘‘ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా బీజేపీకి ఈ మూడు రాష్ట్రాల్లోనూ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్టు తేలిపోయింది. ఫలితంగా అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు...’’ అని ఆమె పేర్కొన్నారు. మరోవైపు మధ్య ప్రదేశ్‌లో తాము కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. మాయావతి ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే, ఈమేరకు ఆయన ట్విటర్లో వెల్లడించారు. ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మొత్తానికి ఉత్తర్ ప్రదేశ్ లో, ఎస్పీ, బీస్పీని కలపాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఇలా ఫలించాయి.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read