మిష్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, ఆంధ్రా వాడి గర్జన ఇంకా ఢిల్లీ పాలకులకు వినపడుతూనే ఉంది.. ఒక పక్క ఐటి, ఈడీ దాడులు చేసి ఎంపీలని బెదిరిస్తున్నారు.. మరో పక్క వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలు ఆడి ఇంట్లో కూర్చున్నారు.. పార్లమెంట్ లో మోడీని నిలదియ్యకుండా తెలుగుదేశం ఎంపీలను అన్ని విధాలుగా బెదిరించారు, మోడీ, షా.. ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా, తెలుగుదేశం ఎంపీలు మాత్రం, వెనక్కు తగ్గలేదు. ఏపికి న్యాయం చెయ్యండంటూ పార్లమెంట్ లో టిడిపి ఎంపీల ఆందోళన కొనసాగించారు. పార్లమెంట్‌ శీతకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ముద్నుగా, తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు చేసారు.

tdp 12122018 2

విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎంపీలు అశోక్‌ గజపతి రాజు, టీజీ వెంకటేశ్‌, మురళీ మోహన్‌, శివప్రసాద్‌, కనకమేడల రవీంద్ర కుమార్‌, కొనకళ్ల నారాయణ, గల్లా జయదేవ్‌ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మరోవైపు శ్రీకాకుళంపై విరుచుకుపడిన తిత్లీ తుపాను విషయంలో కేంద్ర సాయంపై చర్చించాలంటూ రూల్ 377 కింద శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు నోటీసు ఇచ్చారు. తుపాను వల్ల రూ. 3,435 కోట్ల మేర నష్టం వాటిల్లితే కేవలం రూ.539.52 కోట్ల సాయం కేంద్రం విడుదల చేయడంపై ఏపీ ప్రభుత్వం అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.

tdp 12122018 3

ఇది ఇలా ఉంటే సభ ప్రారంభం కాగానే, తెలుగుదేశం ఎంపీలు, ఆందోళనలకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం 12 గంటలకు సభ మళ్లీ ప్రారంభమైంది. అయితే సభ ప్రారంభం అయినా మరోసారి ఆందోళన చేపట్టడంతో స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ సభను రేపటికి వాయిదా వేశారు. తెలుగుదేశం ఎంపీలతో పాటు కాంగ్రెస్ ఎంపీలు కూడా ఫేల్‌ ఒప్పందంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాలంటూ కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. మొత్తానికి వైసీపీ ఎంపీలు మోడీ, అమిత్ షా లకు భయపడి సభ నుంచి పారిపోవటంతో, ఇప్పుడు ఏపి ప్రజల వాయిస్ వినిపించే బాధ్యత తెలుగుదేశం ఎంపీల పై పడింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read