ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపాకు కోలుకోలేని దెబ్బ తగిలిందని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోగా.. మరో రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే విజయం సాధించాయని పేర్కొన్నారు. పార్టీ నేతలతో బుధవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడారు. దేశంలో అనేక పార్టీల నేతల్లో భాజపాపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ‘దేశంలో భాజపా పాలన పోవాలి.. ప్రత్యామ్నాయం కావాలి’ అనేదే అందరి ఆకాంక్ష అని చెప్పారు. ఏపీకి అన్యాయం చేసిన భాజపాను దేశవ్యాప్తంగా తిరస్కరిస్తున్నారని, భాజపాయేతర పార్టీల కలయికకు తేదేపా చేస్తున్న ప్రయత్నాలకు దేశవ్యాప్తంగా ఆమోదం లభిస్తోందని అన్నారు.

cbn 112122018

రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌ ఏపీకి కొన్ని హామీలిస్తే.. వాటిని అమలు చేయకుండా భాజపా నమ్మకద్రోహం చేసిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ చెప్తే.. హోదా ఇచ్చేది లేదని భాజపా పేర్కొందని, అందుకే భాజపా పై పోరాటం చేస్తున్నాం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈడీ, ఐటీ దాడులతో కేంద్రం బెదిరించాలని చూస్తోందని ఆరోపించారు. తెదేపాను ఇబ్బందులు పెట్టాలని మోదీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మనం అప్రమత్తంగా ఉండాలి, ప్రత్యర్ధుల కుట్రలను తిప్పికొట్టాలి, ఏమాత్రం ఏమరుపాటుగా ఉండకూడదు అని చంద్రబాబు అన్నారు.

cbn 112122018

"బిజెపిపై పోరాటానికి కెసిఆర్ కలిసిరాలేదు.కలిసి పోటీచేద్దామంటే తిరస్కరించారు.ఇద్దరుముగ్గురితో కలిసి ధర్డ్ ఫ్రంట్ విఫల ప్రయోగమే.బిజెపికి మేలు చేసే ప్రయత్నమే.అందుకే కాంగ్రెస్ తో సహా బిజేపియేతర పార్టీలన్నీ ఏకం చేస్తున్నాం. అవన్నీ సఫలీకృతం అయ్యాయి. దేశ వ్యాప్తంగా 22 పార్టీలను ఏకం చేసాం. ఇప్పుడు కేసీఆర్ వచ్చి, వీళ్ళను చీలిస్తే, అది మోడీకే లాభం. మీ రెండు కళ్లు పోయినా పర్లేదు. మీ కన్ను మాత్రం పోవాలి అన్నపెడ ధోరణితో బిజెపి వ్యవహరిస్తోంది. ఏపికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి. నమ్మకద్రోహం చేసిన బిజెపికి బుద్దిచెప్పాలి. దేశ భవిష్యత్తు కోసమే జాతీయ స్థాయిలో కీలక భూమిక. తెలంగాణలో ప్రధాని 2సార్లు,అమిత్ షా 7సార్లు పర్యటించారు, ముగ్గురు ముఖ్యమంత్రులు,13మంది మంత్రులు తిరిగారు. 118సీట్లలో పోటిచేసిన బిజెపి ఒక్కసీటే గెలిచింది. తెలంగాణ ఫలితాలు వేరు, మిగిలిన రాష్ట్రాల ఫలితాలు వేరు. ముందస్తు ఎన్నికల వ్యూహం ఫలించింది. రెండు రాష్ట్రాలలో తెలుగుదేశం సంస్థాగతంగా బలపడాలి. ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలి. ప్రతి ఒక్కరిలో పట్టుదల పెరగాలి. ఇక పై అధిక సమయం పార్టీకే కేటాయిస్తాను. ఎవరికీ ఎటువంటి మినహాయింపులు లేవు. ప్రతి నాయకుడు,కార్యకర్త ఇంటింటికీ వెళ్లాలి, ప్రతి లబ్దిదారుడిని పలకరించాలి, అందరినీ పార్టీకి చేరువ చేయాలి. ఈనెల 30న రాజమండ్రిలో బిసి జయహో సదస్సు విజయవంతం చేయాలి. ప్రతి నాయకుడు ప్రజల్లో తిరగాలి. నిరంతరం ప్రజల్లో ఉన్నారు కాబట్టే సండ్ర వీరయ్య,మచ్చా నాగేశ్వర రావు ప్రజాదరణ పొందారు." అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read