ప్రతి ఆరు నెలలకు ఎదో ఒకటి చేసి, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టటం, కేంద్రానికి అలవాటు అయిపొయింది. నోట్లు రద్దు, ఏటిఎం కష్టాలు, జీఎస్టీ, పెట్రోల్ రేట్లు, ధరల పెరుగుదల, ఇలా ప్రతి ఆరు నెలలకు, సామాన్యులను ఇబ్బంది పెడుతున్న కేంద్రం, ఇప్పుడు సామాన్య ప్రజలు వాడే కేబుల్ టీవీ పై పడింది. ట్రాయ్ కొత్త నిబంధనల పేరుతొ, బుల్లితెర వినోదం ఇకపై మరింత భారం కానుంది. సగటు టీవీ వినియోగదారులు ఈనెల భారీ మొత్తంలో కేబుల్‌ బిల్లు చెల్లిస్తే కాని టీవీ చూసే అవకాశం దక్కదనిపిస్తోంది. ట్రాయ్ న్యూ టారిఫ్‌ ఆర్డర్ వినియోగదారులకు పెను శాపంగా మారింది. అధిక చానల్స్‌ వాడకాన్ని అడ్డుకునే ఉద్దేశంతో ట్రాయ్ నూతన టారీఫ్‌ విధానాన్ని ఎంఎస్‌వోలపై తీసుకొచ్చింది. ప్రస్తుతం బుల్లితెర వినియోగదారులు, కేబుల్‌ అపరేటర్ల డీటిహెచ్‌ ప్రచారాల నిమిత్తం నెలకు కొంత మొత్తాన్ని చెల్లించి బల్క్‌గా వచ్చే ఛానల్స్‌ను చూస్తున్నారు. ప్రేక్షకులు చూడని ఛానల్స్‌కు ఎంఎస్‌వోలు డబ్బులు వసూలుచేస్తున్నారని దీనివల్ల వినియోగదారుడికి భారం పడుతుందని ట్రాయ్ భావించింది.

yogi 27122018 3

ఇక పై వినియోగదారడు చూసే ఛానళ్ళకే డబ్బులు చెల్లిస్తే సరిపోతుందనే ఉద్ధేశంతో ఈ న్యూ టారీఫ్‌ విధానాన్ని జనవరి 1 నుంచి అమలు చేయనుంది. ప్రస్తుతం నెలకు రూ.200 నుంచి 300 చెల్లిస్తున్న వినియోగదారుడు ఫ్రీ టూ ఎయిర్‌ ఛానల్స్‌తో పాటు మరో 250 వరకు పేయిడ్‌ ఛానల్స్‌ను చూడగలుతున్నారు. ట్రాయ్ తాజా నిర్ణయంతో ఇంత తక్కువ మొత్తానికే అన్ని ఛానల్స్‌ వచ్చే అవకాశం ఇకపై వుండదని ప్రేక్షకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్రీ టూ ఎయిర్‌ ఛానల్స్‌ను రూ.350 కి అందిస్తుండగా వీటిలో రోజువారి చూసే ఛానల్స్‌ వుంటున్నాయి. వీటిలో భక్తి, వార్త ఛానల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌ ఉన్నాయి. వీటిలో లేని ఛానల్స్‌ను ప్రేక్షకుడు చూడాలనుకుంటే రూ.19 పెట్టి రీఛార్జ్‌ చేయించుకోవాల్సి వుంటుంది. ఈ విధంగా ఎన్ని ఛానల్స్‌ చూడలనుకుంటే అన్ని 19 రూపాయాలు చొప్పున చెల్లించాల్సి వుంటుంది. బాదుడు ఇలా…. : ట్రాయ్ తాజా నిర్ణయంతో వినియోగదారుడు తాను చూసే ఛానళ్ళకే డబ్బులు చెల్లించాలి. ప్రస్తుతం కొనసాగుతున్న విధానం ఈనెల 29తో ముగిసిపోతుంది. కొత్త టారీఫ్‌ ప్రకారం టీవీ ప్రేక్షకుడు రూ.150 చెల్లించి ఫ్రీ టూ ఎయిర్‌ ఛానల్స్‌ చూడాలి. ఫ్రీ టూ ఎయిర్‌ ఛానల్స్‌ 250 వరకు ఉన్నప్పటికీ రోజువారి చూసే ఛానల్స్‌ 30 మాత్రమే లభిస్తాయి. ఇవి కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫ్రీ టూ ఎయిర్‌ ఛానల్స్‌ చూడలనుకుంటే అదనపు చార్జీలు చెల్లించాల్సిందే.

yogi 27122018 4

దాదాపు 400 చెల్లిస్తే గాని మనం ప్రస్తుతం చూస్తున్న నిత్యం ఛానల్స్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.. ఈ నూతన టారీఫ్‌ విధానంతో టీవీ ప్రేక్షకులపై భారం మోపాలని ట్రారు భావిస్తుందని కేబుల్‌ అపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "సాంకేతిక విప్లవం మనిషికి ఆధారం కావాలి తప్ప భారం కాకూడదు. సామాన్య ప్రజలకు ఏకైక ఎంటర్‌టైన్‌మెంట్‌గా టీవీ ప్రస్తుతం నిత్యావసర వస్తువుగా మారింది. కేంద్రం దీన్ని పేదవాడికి భారం మోపేలా చేస్తుంది." అంటూ కేబుల్‌ అపరేటర్ల సంఘం సీమాంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పక్కి దివాకర్‌ అన్నారు. అయితే, ఈ భారం తట్టుకోలేక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది, ఏపి ఫైబర్ వైపు వస్తున్నారు. తక్కువ ధరకు టీవీ, ఫోన్‌, ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పించే ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. టీవీ, ల్యాండ్‌ఫోన్‌, ఇంటర్‌నెట్‌లకు నెలకు రూ.149 అవుతుంది. దీనిపై 18 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. వీటికి సెటప్‌ బాక్స్‌ అవసరం. దీని ధర రూ.4వేలు నిర్ణయించడంతో వినియోగదారుల పై ఫైబర్‌ దూకుడు పెంచింది. ఈ నాలుగు వేలు కూడా నెల నేలా చెల్లించవచ్చు. నెలకు 236 ప్లాన్‌ తీసుకుంటే టీవీలో ప్రస్తుతం వస్తున్న అన్ని రకాల ఛానల్స్‌ విక్షించవచ్చు. ఇందుకోసం అధికమంది కేబుల్‌ అపరేటర్లుకు ఫ్రైబర్‌ నెట్‌ కనక్షన్ల్‌కు డిమాండ్‌ పెరిగింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read