ఇంద్రకీలాద్రి పై చోటు చేసుకుంటున్న వరుస వివాదాలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకమండలి, పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ ఆయన అసహనానికి గురయ్యారు. దసరా ఉత్సవాల కంటే ఆలయంలో వివాదాలే ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయని మండిపడ్డారు. తీరు మారకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని సీఎం హెచ్చరించారు. ముఖ్యమంత్రి సందేశాన్ని ఆయన కార్యాలయ అధికారులు పాలకమండలి చైర్మన్‌కు ఫోన్ చేసి చెప్పారు. ఆలయంలో వివాదాలకు స్వస్తి పలకాలని, అధికారులతో సమన్వయంతో పని చేయాలని సూచించారు.

cbnwarning 17102018 2

ఉత్సవాల మొదటిరోజే లిఫ్ట్‌ల్లో భక్తులు కొండపైకి వస్తున్నప్పుడు వాటిని ఆపేశారు ఓ ఉన్నతోద్యోగి. అకస్మాత్తుగా లిఫ్టులు ఆగిపోవడంతో భక్తుల హహాకారాలు చేశారు. గందరగోళ పరిస్ధితి తలెత్తింది. ఇక, తిరుమలతిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన సారే సమర్పించే విషయంలోనూ పాలకమండలి సభ్యులు.. ఆలయ ఈవోను టార్గెట్ చేశారు. స్ధానిక శాసనసభ్యుడు, టీటీడీ మెంబరు బోండా ఉమాకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంతో తనకు సంబధం లేదని చెప్పినా వినకుండా కోటేశ్వరమ్మ పై తీవ్ర విమర్శలు చేశారు.

cbnwarning 17102018 3

అటు, తన కుటుంబ సభ్యులను నేరుగా అంతరాలయంలోకి అనుమతించలేదని, ఆలయ ప్రాంగణంలో కూర్చొని పాలకమండలి ఛైర్మన్ గౌరంగబాబు నిరసన తెలిపారు. ఇలా ప్రతి విషయంలోనూ ఈవోనూ, అధికారులను టార్గెట్ చేసుకుని జరిగిన ఘటనలతో ఈవో కోటేశ్వరమ్మ మనస్తాపానికిగురయ్యారు. అయితే, రోజుకి ఒకసారి ఇలా ఇంద్రకీలాద్రి అనవసరమైన గొడవల్లో వార్తల్లోకి వస్తుంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళంలో ఉన్నా, ఆయనే స్వయంగా కలగచేసుకుని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read