జనసేన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని పవన్ చేసే ప్రతి చర్యతో అర్ధమవుతుంది. సరి కొత్త రాజకీయం అని చెప్పే పవన్, ఇప్పటి వరకు, కేవలం ఆ పార్టీ, ఈ పార్టీ వదిలేసిన నేతలనే, పవన్ చేర్చుకుంటున్నారు. 2014కి ముందు శాసనసభ స్పీకర్‌గా వ్యవహరించిన నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసినప్పటికీ కాంగ్రెస్ తరఫున నాదెండ్ల మనోహర్ పోటీచేశారు. మెడలో మూడు రంగుల కండువా ధరించి ఫక్తు కాంగ్రెస్ నేతగా దర్శనమిచ్చే నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరడం కాంగ్రెస్‌వాదులకు ఆశ్చర్యం కలిగించింది. నాదెండ్ల మనోహర్‌ను జనసేనపార్టీలో చేర్చుకోవడం వెనుక విజయవాడకు చెందిన ఒక పారిశ్రామికవేత్త మధ్యవర్తిత్వం నెరిపారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

janasena 18102018 2

ఎందుకంటే ఆ పారిశ్రామికవేత్త అటు మనోహర్‌కీ, ఇటు పవన్కీ కూడా సన్నిహితుడే. ఏ ఉద్దేశంతో మనోహర్ జనసేనలో చేరారో తెలియదు కానీ.. ఈ పరిణామం వల్ల పవన్‌కల్యాణ్‌కు రెండు ప్రయోజనాలు నెరవేరాయి. జనసేన పార్టీ ఒకే సామాజికవర్గానికి పరిమితమైందనే భావన ఈ ఘటనతో సమసిపోయిందని జనసైనికులు అంటున్నారు. రెండవది నాదెండ్ల మనోహర్ వివాదాలకు దూరంగా ఉంటారు. నిజాయితీపరుడు. మనోహర్‌తో పాటు గుంటూరు జిల్లాలకు చెందిన మరికొంతమంది నేతలకు జనసేన, వైసీపీలు వల విసిరాయి. రేపల్లె మాజీ ఎమ్మల్యే దేవినేని మల్లిఖార్జునరావును రెండు పక్షాలు సంప్రదించాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న దేవినేని మల్లిఖార్జునరావును ఆ పార్టీ పెద్దలు పట్టించుకోలేదన్న భావన ఆయన అనుచరుల్లో ఉంది.

janasena 18102018 3

అటు రేపల్లె, ఇటు వేమూరు నియోజకవర్గాల్లో మల్లిఖార్జునరావుకు పట్టు ఉంది. ఇక చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్‌ను ఆ నియోజకవర్గ సమన్వయకర్త పదవి నుంచి పార్టీ అధ్యక్షులు జగన్ ఆకస్మికంగా తప్పించారు. కేవలం డబ్బులు లేవనే సాకుతోనే ఆయనను ఆ పదవి నుంచి తొలగించారన్నది పలువురి అభిప్రాయం. దీంతో ఆయన అనుచరులు పార్టీకి రాజీనామా చేసి నిరసన వ్యక్తంచేశారు. ఈ తరుణంలో రాజశేఖర్‌ను జనసేన పార్టీ నేతలు సంప్రదించినట్టు సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా కోస్తాలో అత్యంత కీలకమైన గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో కూడా జనసేనను సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు నాదెండ్ల మనోహర్ సారథ్యంలో జనసేన పావులు కదుపుతోంది. ఇలా వాళ్ళు వీళ్ళు వదిలేసిన నేతలను టార్గెట్ గా పెట్టుకుని, వారిని పార్టీలో చేర్చుకుని, సరి కొత్త రాజకీయం అని పవన్ చెప్పటం, మనం వినటం సరిపోయింది..

Advertisements

Advertisements

Latest Articles

Most Read