వైసీపీ అధినేత జగన్, ఆయన మీడియా, సోషల్ మీడియా సంస్థలు చేస్తున్న దుష్ప్రచారం పై శ్రీకాకుళం జిల్లావాసులు మండిపడుతున్నారు. బాధితుల దగ్గరకే నేరుగా ముఖ్యమంత్రి, మంత్రులు వచ్చి..నష్టం పరిశీలించి..అన్నివిధాలు ఆదుకుంటుంటే..మీ రాజకీయాలు ఏంటి జగన్? అని నిలదీస్తున్నారు. తిత్లీ తుఫాన్ బాధితులను పరామర్శించడానికి రాకుండా...ప్లానింగ్ ముద్దులు, ప్యాకేజీ నిమురుడులతో పదవి కోసం పాదాల యాత్ర చేస్తున్న జగన్..పట్ల శ్రీకాకుళం వాసుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని ..వైసీపీ సలహాదారులు ఒక నివేదిక ఇచ్చారట! అయితే తమపట్ల ఉన్న వ్యతిరేకతను ప్రభుత్వం పట్ల తిప్పాలంటే ఏం చేయాలి? అనే దుర్మార్గపు ఆలోచనలో భాగంగానే.. తుఫాన్ బాధితులకు సహాయం పేరుతో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ప్రచారయావ వల్లే సహాయకచర్యలు సాగడంలేదనే కథనాలు వండి వారుస్తున్నారు. అయితే ఉద్దానంలో పర్యటించిన మంత్రి నారా లోకేష్, అక్కడ నేరుగా ఇంటింటికీ వెళ్లి మరీ సమస్యలు పరిశీలించి...తక్షణ అవసరాలను గుర్తించి సహాయం అందించే ఏర్పాట్లు చేశారు.
రాత్రి 2 గంటల వరకూ మేలుకుని ఉండి సమీక్షలు చేస్తూ...ఉదయం 6 గంటలకే తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల కష్టాలు, అవసరాలు తెలుసుకుంటూ చొరవగా పరిష్కరిస్తున్న మంత్రి నారా లోకేష్‌కి ప్రజల్లో ఆదరణ బాగా పెరిగిందనే నివేదిక కూడా వైసీపీ సలహాదారులు జగన్‌కు పంపారట. ఇది తట్టుకోలేని జగన్...ఐటీ మంత్రి నారా లోకేష్ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ఎందుకు పర్యటిస్తున్నారంటూ ఓ పనికిమాలిన కథనాన్ని సర్కులేట్ చేయించారు. అక్రమాస్తుల వారసుడు, లక్ష కోట్ల అక్రమార్కుడు అయిన జగన్ స్థాపించిన పార్టీకి, ఆ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న పెయిడ్ జర్నలిస్టులకు నారా లోకేష్ ఐటీతోపాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు వంటి కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలియకపోవడం విచారకరం. మరోవైపు తుఫాన్ భయంతో పాదయాత్రకు సెలవు పెట్టి తన అక్రమాలకు సాక్షి అయిన లోటస్‌పాండ్‌కు పారిపోయి...టికెట్ల అమ్మకాల పని చూసుకున్న జగన్...తుఫాన్ బాదిత ప్రాంతాలలో ఇంటింటికి తిరుగుతూ సమస్యలు పరిష్కరిస్తున్న మంత్రి నారా లోకేష్‌పై అవాస్తవ ఆరోపణలు, కుట్రపూరిత కథనాలతో బద్నాం చేయాలని చూడటం హాస్యాస్పదం అని.. స్థానికులు అంటున్నారు. తిత్లీ విధ్వంసం తరువాత పల్లెలకు నేరుగా వెళ్లి తాగునీరు, ఆహారం అందేలా చూడటం..పారిశుధ్యం మెరుగుకు యుద్ధప్రాతిపదికగా చర్యలు తీసుకున్నది...ఐటీ శాఖ చూస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రే అని తెలియకపోవడం ఇంకా విచిత్రం.
మరోవైపు తుఫాన్ బాధితులు సీఎంని, మంత్రులని నిలదీస్తున్నారని రాశారు. ఇది కరెక్టే! కష్టంలో ఉన్న బాదితులు సహాయం కావాలని అడుగుతారు..వారు అడుగుతారని, వారికేం కావాలో అదే చేద్దామని సీఎం, మంత్రులు తుఫాన్ బాధితుల వద్దకే నేరుగా వెళుతున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న ఏ ప్రభుత్వాధినేత అయినా..ఇలాగే చేస్తారు. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రులూ చేశారు. శుక్రవారం వస్తే కోర్టుకి, తుఫాన్ వస్తే లోటస్‌పాండ్‌కి పారిపోయే పదవీకాంక్ష పాదయాత్రీకుడికి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అన్ని శాఖల ఉన్నతాధికారులూ, ప్రత్యేక బృందాలూ శ్రీకాకుళంలో తుఫాన్ పీడిత ప్రాంతాలలో యుద్ధప్రాతిపదికన సహాయకచర్యలు చేపట్టాయి. ఇంకా కొనసాగిస్తున్నాయి. ఇందులో ప్రచార యావ ఏంటో ఎవరికీ అర్థంకావడంలేదని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 40 ఏళ్ల రాజకీయ జీవితం..అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, కేంద్రంలోనూ చక్రంతిప్పిన చాణుక్యుడు, దేశంలో ఐటీ రంగం అభివృద్ధికి ఆద్యుడైన చంద్రబాబు...ఇటీవలే ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని భారతదేశ కీర్తిపతాకను రెపరెపలాడించారు. తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటారు. అటువంటి విజనరీ ముఖ్యమంత్రి తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొని ప్రచారం పొందాలని చూస్తున్నారని వైసీపీ చేస్తున్న విషప్రచారాన్ని ఎవరైనా నమ్ముతారా? ఐటీలో జీరోగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను సాటిలేని మేటిగా మార్చిన నారా లోకేష్... పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల పనితీరుకు స్కోచ్ అవార్డులు, పలు రివార్డులు గెలుచుకున్న మంత్రి లోకేష్...తుఫాన్ బాధితులకు సహాయం చేయడం తన బాద్యతగా భావించారు. నిద్రలేకుండా, తిండి లేకుండా... పరిస్థితి చక్కదిద్దేవరకూ ఇక్కడే ఉంటానని ప్రతినబూని పనిచేస్తున్న మంత్రిది ప్రచార యావంటూ ప్రచారం చేస్తున్న మీ విషరాజకీయాలు..మేము కష్టకాలంలో ఉన్నప్పడు వద్దంటూ జగన్‌కి శ్రీకాకుళం వాసులు హెచ్చరిస్తున్నారు.