తెలంగాణలో ముందస్తు ఎన్నికల జ్వరం రాజకీయపార్టీలను అతలాకుతలం చేస్తోంది... ఇప్పటికే అసెంబ్లీని రద్దు చెయ్యటం, ఎన్నికల తేదీలు ప్రకటించటం, ఐటి రైడ్లు, ప్రచార హడావిడి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే తెలంగాణా నాయకులకు, ముఖ్యంగా తెరాస నాయకులకు మాత్రం, ఎప్పుడూ ఆంధ్రా మీదే టార్గెట్. చంద్రబాబుని టార్గెట్ చెయ్యాలి, జగన్ ను లేపాలి అనే ధ్యాస మీదే ఆగిపోతున్నారు. కెసిఆర్, కేటీఆర్ రోజు ఎలా తిడుతున్నారో చూస్తున్నాం. ఇప్పుడు, వీరికి తోడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తయారయ్యాడు. అప్పట్లో కెసిఆర్ చెప్పిన జోస్యం లాగా, ఇప్పుడు కూడా ఆంధ్రాలో నెక్స్ట్ సియం ఎవరనేది చెప్పిస్తున్నారు. ఆంధ్రలో రాబోవు ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావటం, చంద్రబాబు ఓడిపోవటం తధ్యమని, జోష్యం చెప్పారు.
జగన్ కూడా ప్రతి సందర్భంలో, కేసీఆర్ కు సపోర్ట్ చేస్తున్నారు. తెలంగాణలో మళ్లీ టిఆర్‌ఎస్ కనుక గెలిస్తే, రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కెసిఆర్ కీలకమైన పాత్ర పోషిస్తారని, ఆ పార్టీకి చెందిన నాయకులు, వైకాపాకు చెందిన నాయకులు చెబుతున్నారు. డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మళ్లీ కొలువు తీరితే కెసిఆర్ ఆంధ్రా పై దృష్టిసారిస్తారని, ఆంధ్రాలో ఆయన ప్రచారం చేసినా చేయవచ్చునని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే జగన్ నయమని ఆయన చెప్పబోతున్నారని కెసిఆర్ కనుక మళ్లీ తెలంగాణలో గెలిస్తే, ఇక్కడ చంద్రబాబుకు ఇక్కట్లు తప్పవని, టిఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ముందస్తు ఎన్నికల్లో కెసిఆర్ కనుక ఘనవిజయం సాధిస్తే, ఆ ప్రభావం ఆంధ్రా రాజకీయాల పై ఖచ్చితంగా ఉంటుందని వారు చెబుతున్నారు. బిజెపితో అంటకాగుతున్న కెసిఆర్ తమకు కామన్ శత్రువు అయిన చంద్రబాబును ఓడించడానికి, ఆంధ్రాలో పర్యటిస్తారని, అదే సమయంలో జగన్ కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరతారని ప్రచారం జరుగుతోంది. అందుకే జగన్ కూడా రంగంలోకి దిగారు. అవసరం అయిన చోట ఫైనాన్సు చెయ్యటానికి కూడా సిద్ధమయ్యారు. మిషన్ భాగీరధ కాంట్రాక్టు తీసుకున్న తన నాయకులని, కెసిఆర్ కు తగు సహాయం చెయ్యమని ఆదేశించారు. ఈ బాధ్యత అంతా విజయసాయి రెడ్డికి అప్పగించినట్టు తెలుస్తుంది. కెసిఆర్ గెలుపు కోసం, తన సామాజిక వర్గ పెద్దలని సపోర్ట్ చెయ్యమని అడుగుతున్నారు. అయితే ఇప్పటికే రెడ్లు అందరూ , కెసిఆర్ కి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. జగన్ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి...