ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చెయ్యటమే కాకుండా, మాకు న్యాయం చెయ్యండి అని అడిగినందుకు, మోడీ-షా లు మన రాష్ట్రం పై చేస్తున్న కుట్రలు చూస్తున్నాం. అయితే మోదీ ప్రభుత్వంపై చేస్తున్న ధర్మపోరాటాన్ని చేసిన చంద్రబాబు, వీటిని ఏపి రాష్ట్రానికే పరిమితం చెయ్యకుండా, ఇతర రాష్ట్రాల్లో తెలుగువారి సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ధర్మ పోరాట సభలు నిర్వహించాలని నిశ్చయించారు. దీని వెనుక, మోడీ పై పోరాటం దేశ వ్యాప్తంగా చేసి, ఏపికి జరుగుతున్న అన్యాయం చెప్పటం ఓకే ఎత్తు అయితే, రాజకీయంగా కూడా వారికి దెబ్బ వెయ్యనున్నారు. ఇతర రాష్ట్రాల్లో తెలుగువారి సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని, వారిని వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైపు వెళ్ళకుండా చైతన్య పరచనున్నారు. అయితే ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీని ఎదుర్కునే వ్యూహంలో భాగంగా, ఇలా వేరే రాష్ట్రాల్లో చెయ్యటం ఇదే మొదటి సారి అవుతుంది.

cbn 29102018 2

కర్ణాటకలో తెలుగువారు ఎక్కువగా ఉన్నారని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తన పిలుపు మేరకు బీజేపీకి వ్యతిరేకంగా వారు ఓటేశారని సీఎం గుర్తుచేస్తున్నారు. తమిళనాడులో కూడా తెలుగువాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నందున చెన్నైలో ఒక ధర్మపోరాట బహిరంగ సభ పెట్టాలని అనుకుంటున్నారు. సీబీఐ, ఈడీల నుంచి ఐటీ శాఖల వరకు ప్రతి వ్యవస్థను మోదీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తున్న తీరు గురించి ఢిల్లీ వెళ్లి పలు పార్టీల నేతలకు వినిపించిన చంద్రబాబు.. ఇదే అంశంపై కలిసొచ్చే ఇతర నాయకులతోను మాట్లాడాలని భావిస్తున్నారు. శనివారం, బీఎస్పీ అధినేత్రి మాయావతి నుంచి ఫరూక్‌ అబ్దుల్లా, శరద్‌యాదవ్‌, కేజ్రీవాల్‌, సీపీఐ అగ్రనేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, రాజా వరకు అందరినీ ఢిల్లీలో కలిశారు.

cbn 29102018 3

దీనికి కొనసాగింపుగా జరుగుతున్న పరిణామాలు, కుట్రలపై టీఎంసీ నాయకురాలు, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో కూడా చంద్రబాబు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. బెంగాల్లో కూడా కేంద్ర కక్షపూరిత వ్యవహారాలకు వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు. తొలుత జనవరిలో ఈ సభను నిర్వహించాలనుకున్నా.. కేంద్ర వైఖరిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముందుగానే జరిపితే బాగుంటుందని చంద్రబాబు ప్రతిపాదించినట్లు సమాచారం. దేశంలో ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని చంద్రబాబు భావిస్తున్నారు. ‘ప్రశ్నిస్తే వేధింపులు.. పోరాడితే సాధింపులు.. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కక్షసాధింపు కోసం వాడుకుంటున్నారు. ప్రజాస్వామ్య గొంతుకలు వినపడకూడదు. తామనుకున్నదే శాసనం అన్నట్లుగా నియంత్రత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారు. మొత్తంగా చూస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడింది. దీన్ని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా ధర్మపోరాటం నిర్వహించాలి’ అని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read