వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పై కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు వైసీపీ అభిమాని అని ఘటన జరిగిన రోజునే తేలినా, అతను టీడీపీ కార్యకర్త అంటూ కొన్ని టిడిపి ఐడీ కార్డులు ఆదివారం బయటకు రావడం కలకలం రేపింది. జానిపల్లి శ్రీనివాసరావు, అతని సోదరుడు సుబ్బరాజు పేర్లతో ఉన్న ఆ ఐడీ కార్డులు ఫేక్‌ గా తెలుగుదేశం నాయకులు తేల్చారు. వారిద్దరూ టీడీపీ సభ్యులుగా చిత్రీకరించేందుకు జరిగిన కుట్రను ఛేదించారు. చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజంతా హైడ్రామాకు తెరతీసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు శ్రీనివాసరావు 2016లో టీడీపీ సభ్యత్వం పొందినట్లు 05623210 నంబరుతో ఒక గుర్తింపు కార్డు, అతని సోదరుడు సుబ్బరాజు కూడా అదే ఏడాది టీడీపీ సభ్యత్వం పొందినట్లు 05623209 నంబరు కలిగిన మరోకార్డు సోషల్ మీడియాలో షికారు చేశాయి.

varla 29102018

వాస్తవానికి దాడి జరిగినప్పుడే మీడియా ముందుకు వచ్చిన సుబ్బరాజు తాము ఏ పార్టీకి చెందిన వారం కాదని, తమ్ముడికి జగన్‌, వైసీపీలంటే ప్రాణమని చెప్పాడు. కానీ, అన్నదమ్ముల పేర్లతో సభ్యత్వ కార్డులు రావడం ‘విచిత్రం. ప్రచారంలో ఉన్న సభ్యత్వ కార్డులపై నంబర్లు ఉండటంతో, అవి అసలైనవో, నకిలీవో గుర్తించడం టీడీపీ నాయకులకు సులువైంది. ఆ నంబర్ల ఆధారంగా అసలు కార్డులను మీడియాకు విడుదల చేశారు. సుబ్బరాజు పేరుతో బయటకొచ్చిన 05623209 నంబరును కార్డును వాస్తవంగా ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గానికి చెందిన మొలకలపల్లి వెంకటరమణమ్మకు టీడీపీ జారీ చేసింది. అదేవిధంగా శ్రీనివాసరావు పేరుతో ఉన్న 056232210 నంబరు కార్డును బాపట్ల నియోజకవర్గ పరిధిలోని కర్లపాలెం మండలం గణపవరానికి చెందిన అంకాలు నంబూరికి కేటాయించారు.

varla 29102018

ఈ ఒరిజినల్‌ కార్డులు తీసుకొని వెంకటరమణమ్మ ఫొటో స్థానంలో సుబ్బరాజు ఫొటోను, నంబూరి అంకాలు స్థానంలో శ్రీనివాసరావు ఫొటోను ఉంచి తప్పుడు టీడీపీ సభ్యత్వ కార్డులను సృష్టించారు. ఈ ఆధారాలతో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య.. గుంటూరులో టీడీపీ రాష్ట్ర కార్యాలయం పరిధిలో ఉన్న అరండల్‌పేట పోలీ్‌సస్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. కుట్ర, మోసం, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం, మార్ఫింగ్‌ చేసి తప్పుడు కార్డుల సరైనవేనని చూపించడం, ఆధారాలు తారుమారు చేయడం, ప్రజాశాంతికి విఘాతం కలిగించడం తదితర అభియోగాలను ఫిర్యాదులో ప్రస్తావించారు. వీటి ప్రకారం ఈ నకిలీ కార్డుల అంశం పై ఐపీసీలోని 120 (బి), 420, 468, 469, 471, 201, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెస్ట్‌ డీఎస్పీ సౌమ్యలత తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read