వైసీపీ అధినేత, ప్రతిపక్ష వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో, కోడి కత్తితో గుచ్చిన సంగతి తెలిసిందే. వెంటనే వైజాగ్ ఎయిర్ పోర్ట్ లోనే అపోలో డాక్టర్ చేత ఫస్ట్ ఎయిడ్ ఇప్పించారు. జగన్ షర్టు మీద కూడా, ఒక చోట కొంచెం రక్తం ఉండటం చూసాం. వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, జగన్ కు 0.5 cm length & 0.5 cm depth ఉన్న గాయం అయ్యింది. ఫస్ట్ ఎయిడ్ చేసిన వెంటనే, జగన్ హైదరాబాద్ వెళ్లారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లారు. తరువాత కొంచెం సేపటకి మళ్ళీ ఇంటి నుంచి హాస్పిటల్ కు వెళ్లారు. ఇదంతా జరగటానికి దాదాపుగా 4-5 గంటల సమయం పట్టింది.
అయితే వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో 0.5 cm ఉన్న దెబ్బ, హైదరాబాద్ లో హాస్పిటల్ కి చేరేసరికి 9 కుట్లు అయ్యే గాయం అయ్యింది. అంతేనా దీనికి మరలా ICU & 24 గంటల అబ్సెర్వేషన్, గంట గంటకు హెల్త్ బులిటెన్ అంటూ హడావిడి చేస్తున్నారు. చొక్కాకి చిల్లు పడలేదు కాని, చర్మానికి తొమ్మిది కుట్లు పడ్డాయి అంటూ, సాక్షి టీవీ హడావిడి చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారో, ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారో వారికే తెలియాలి. దెబ్బ తగిలిన తరువాత కూడా, జగన్ అందరికీ నమస్కారం పెట్టుకుంటూ నిటారుగా నడుస్తూ చక్కగా వైజాగ్ నుంచి వెళ్లారు.
అయితే హైదరాబాద్ హాస్పిటల్ లో చేరగానే మాత్రం, మంచానికి అడ్డం పడి, కళ్ళు మూసేసారు. దీంతో సాక్షి ఎమోషనల్ డ్రామా మొదలు పెట్టింది. జగన్ కు ఆపరేషన్ జరిగిందని, 9 కుట్లని, 24 గంటల అబ్సెర్వేషన్లో ఉంటే కాని చెప్పలేమని, స్పెషల్ డాక్టర్స్ వస్తున్నారని, ఇలా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. అయితే, భుజానికి గాయమైతే న్యూరో డాక్టర్లు ఏం చేస్తారు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇలాంటి గాయాలకు వెళ్లాల్సింది అపోలోకో, మరో జనరల్ డాక్టర్ దగ్గరకో అయితే, జగన్ మాత్రం సిటీ న్యూరో సెంటర్ కు వెళ్లారు. ఈ హాస్పిటల్ కడపకు చెందిన వారిదని, జగన్ బంధువులుదని తెలుస్తుంది. మొత్తానికి, ఇలా రక్తి కట్టిస్తున్నారు. రేపు అయినా పాపం జగన్ ని ఇంటికి పంపిస్తారో, లేక మెరుగైన వైద్యం కోసం, అమెరికా పంపించాలి అంటారో.