వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై ఈ రోజు విశాఖ విమానాశ్రయంలో దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు జగన్‌పై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారి విచారణలో ఆసక్తికర విషయాలను నిందితుడు వెల్లడించినట్టు సమాచారం. జగన్‌ సీఎం అయ్యేందుకు అవకాశాలు మెరుగు పడతాయని, ఆయనకు సానుభూతి వస్తుందని, జగన్‌కు అది ఉపయోగపడుతుందనే తాను దాడి చేసినట్టు పోలీసుల ఎదుట చెప్పినట్టు ఏడీసీపీ మహేంద్రపాత్రుడు వెల్లడించారు. తూర్పుగోదావరిజిల్లా ముమ్మడివరం మండలంలోని ఠానేలంకకు చెందిన శ్రీనివాస్‌ ఆరుగురు సంతానంలో ఆరోవాడని, ఆ కుటుంబానికి చెందిన ఓ సోదరుడు బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్నారని తెలిపారు.

phone 25102018 2

నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఓ ఫోన్‌లో జగన్‌ ఫ్లెక్సీ ఉందని, ఆ ఫొటోను కొందరు మార్ఫింగ్‌ చేసి సీఎం, లోకేశ్‌ ఫొటోలు పెడుతున్నారన్నారు. ఇలా మార్ఫింగ్‌ చేసి ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టడం చట్టవిరుద్ధమని, గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగన్‌పై దాడి నేపథ్యంలో కొందరు పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని ఏడీసీపీ విజ్ఞప్తి చేశారు. నిందితుడిని విచారిస్తున్నామని పూర్తి వివరాలు ఇంకా వెలుగులో వస్తాయని చెప్పారు. శ్రీనివాస్‌ ఏడాది కాలంలో తొమ్మిది సెల్‌ఫోన్లు మార్చినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రత్యేకంగా గత మూడు నెలల్లోనే ఆరు సెల్‌ఫోన్లు మార్చినట్టు చెప్పారు. ఇప్పుడు వాడుతున్నది కూడా రెండు రోజుల క్రితమే సెల్‌ నెంబర్‌ యాక్టివేట్‌ అయిందన్నారు. దీనిపై లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు.

phone 25102018 3

డీజీపీ ఆదేశాల మేరకు సిట్‌ ఏర్పాటు చేశామన్నారు. సిట్‌కు నేతృత్వం వహిస్తున్న నాగేశ్వరరావు, సీఐలు ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించే పనిలో ఉన్నారని చెప్పారు. నిందితుడి ఇంటిని సోదాలు చేస్తున్నామని, దర్యాప్తుకు ఆటంకం కల్గించని విషయాలను ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న జగన్‌ను విచారించేందుకు ఓ ఏసీపీ హైదరాబాద్‌కు వెళ్లారని తెలిపారు. వాస్తవానికి జగన్‌.. ప్రథమ చికిత్స అనంతరం ఈ మధ్యాహ్నం ఒంటిగంట విమానంలో హైదరాబాద్‌కు వెళ్లారని, ఆయనను విచారించి పూర్తి వివరాలను తెలుసుకుంటామని తెలిపారు. దాడి సందర్భంలో అక్కడ ఉన్న కార్యకర్తలు, అక్కడ పనిచేస్తున్నవారిని విచారించనున్నట్టు ఏడీసీపీ స్పష్టంచేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read