ఇష్టం వచ్చినట్టు, స్వతంత్రంగా పని చేస్తున్న వ్యవస్థల్లో, తలదూర్చి, వ్యవస్థలను నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ఈ రోజు సుప్రీంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ మొదలైంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను అర్ధ రాత్రి హడావుడిగా విధుల నుంచి తప్పించినప్పటికీ సుప్రీంకోర్టు ఎంత వరకు ఆమోదిస్తుందన్న అనుమానం ఇప్పుడు బీజేపీ నేతలను తొలిచేస్తోంది. మంగళవారం అర్ధరాత్రి మొదలైన నాటకీయ పరిణామాలకు కొనసాగింపుగా అన్నట్లు గురువారం ఉదయం సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ ఇంటి వద్ద కలకలం చెలరేగింది. అక్కడ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)కి చెందిన నలుగురు సిబ్బంది తచ్చాడుతూ కనిపించడం మరో దుమారానికి దారితీసింది. అర్ధరాత్రి వేళ తన అధికారాలను ఉపసంహరించి, సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

cbi 24102018 1

దీనిపైనే అందరి కళ్లూ కేంద్రీకృతమయ్యాయి. ఈ నేపథ్యంలో సీబీఐ అధికార ప్రతినిధి నిన్న హడావిడిగా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సీబీఐ డైరెక్టర్‌గా వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌గా అస్థానా కొనసాగుతున్నారని స్పష్టం చేశారు. వారిని పదవుల నుంచి తొలగించలేదని, కొత్తగా నియమితులైన నాగేశ్వరరావుకు డైరెక్టర్‌ బాధ్యతలే అప్పగించామని, హోదా ఇవ్వలేదంటూ తేల్చిచెప్పారు. సీబీఐలో ముసలంపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శల వాడిని పెంచారు. మరోవైపు సీబీఐలోని పలువురు అధికారులపై ప్రత్యేక బృందం(సిట్‌)తో దర్యాప్తు జరిపించాలని గురువారం ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.

cbi 24102018 1

ఈ రోజు సుప్రీం విచారణ పై, దాదాపు రెండు దశాబ్దాల క్రితం వినీత్ నారాయణ్ కేసులో ఎదురైన అనుభవమే ఎక్కడ ఎదురవుతుందోనని బీజేపీ నేతలు భయపడుతున్నారు. ఆ కేసులో కేంద్రానికి మొట్టికాయలు వేసిన సుప్రీం కోర్టు సీబీఐలో రాజకీయ జోక్యాన్ని నిరోధించాలని తీర్పు ఇచ్చింది. అందుకు అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తూ సీబీఐ డైరెక్టర్‌కు పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా రెండేళ్ల పదవీ కాలాన్ని నిర్ణయించింది. అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉండడంతో బీజేపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. అలోక్ వర్మ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం నిజానికి 1997 నాటి సుప్రీం తీర్పుకు పూర్తిగా వ్యతిరేకమైనది. వర్మను పక్కనపెట్టినప్పుడు కొలీజియం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే విషయం నేడు కోర్టులో ప్రస్తావనకు వస్తే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read