తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం పై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపిస్తూ కొత్త చర్చకు దారి తీసారు. తెలంగాణాలో ఎన్నికలు జరుగుతున్న వేళ, లక్ష్మీనారాయణ మాటలు ఆసక్తి రేపుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం, అమల్లోకి తెచ్చిన రైతుబంధు, రైతు బీమా, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలు ప్రజలకు ఎంతో ప్రయోజనకరమైనవని లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయుల కాలంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అప్పట్లోనే గొలుసుకట్టు చెరువులను నిర్మించి పంటలకు సాగునీరందించేందుకు కృషి చేశారని తెలిపారు. అలాంటి చెరువులను అభివృద్ధి చేసి.. నీటి నిల్వలను పెంచేలా మిషన్‌ కాకతీయ పథకం చేపట్టడం గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు.

lakshminaryaan 22102018

వ్యవసాయానికి ప్రాధాన్యమివ్వడం అభివృద్ధికి కీలకమని, సాగు రంగం అభ్యున్నతి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మందలపల్లిలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో పనిచేసేందుకు తనకు అవకాశం కల్పించనందువల్లే ఏడేళ్ల ముందుగానే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశానని తెలిపారు. తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారమంతా సత్యదూరమేననిని స్పష్టం చేశారు. అవసరమైన సమయంలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు.

lakshminaryaan 22102018

అయితే ఒక పక్క మిషన్ కాకతీయ పథకం పై పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే విమర్శలు వస్తుంటే, లక్ష్మీనారయణ అద్భుతం అనటం వెనుక, ఏదన్నా రాజకీయ కారణం ఉందా అనే చర్చ కూడా వస్తుంది. అయితే ఆయన ఆ ప్రయత్నాన్ని, ఆ కార్యక్రమాన్ని మెచ్చుకున్నారని, పనులు జరుగుతున్న తీరు పై కాదని, లక్ష్మీనారయణ వర్గీయులు సమర్ధించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా, ఒక పక్క తెలంగాణా సమాజంలో అధిక మంది, కేసీఆర్ చేస్తున్న పనుల పై విమర్శలు చేస్తుంటే, లక్ష్మీనారయణ వచ్చి, అద్భుతం అంటూ కితాబు ఇవ్వటం చూస్తుంటే, దీని వెనుక రాజకీయం కారణం లేకపోలేదనే మాటలు వినిపిస్తున్నాయి. లక్ష్మీనారయణ ఇటీవలే, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలు తిరిగి, త్వరలోనే రాజకీయ నిర్ణయం తీసుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read